గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 15 మే 2015 (16:22 IST)

త్రినేత్రం సంకేతం ఏమిటి..? శివుడు, దుర్గాదేవికి మూడో నేత్రం..!

త్రినేత్రం, ముక్కంటి అనేవి పాశ్చాత్యులకు ఎంత ఆలోచించినా అంతుపట్టని అంశం. శివునిని ముక్కంటిగా కొలుస్తారు. దుర్గాదేవికి మూడో కన్ను వర్ణిస్తారు. నుదుటి మధ్యలో వున్న ఆ మూడో కన్ను తెరిస్తే ప్రళయమొస్తుందనేది ప్రగాఢ విశ్వాసం. 
 
మనిషిలోని శక్తిని, ఆధ్యాత్మికతను వెలుపలికి తీసుకురావాలంటే ఈ మూడో కంటితో చూడాలంటారు. మూడో కన్నును విధ్వంసానికి ప్రతీకగా వర్ణించినా మూడో కన్ను వాస్తవానికి ఆత్మజ్ఞానానికి సంబంధించినది.

ఆత్మశోధనను, స్వచ్ఛతకు, నిజాయితీకి మూడో కంట చూపు దోహదపడుతుంది. కానీ దీని గురించి వినియోగించేవారు తక్కువ. వీబూది నుదిటిన రాసుకుని దాని మధ్యలో గంధం లేక కుంకుమ బొట్టును పెట్టుకోవడమే త్రినేత్ర సంకేతం.