శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (11:21 IST)

శ్రీనివాసమంగాపురంలో టిటిడి సిబ్బంది చేతివాటం..!

చిత్తూరు జిల్లాలో టిటిడి ఆధ్వర్యంలో ఉన్న ఆలయాల్లో సిబ్బంది చేతివాటం అంతా ఇంతాకాదు. కొంతమంది ఉద్యోగులు ప్రతిరోజు ఎంతోకొంత తీసుకుని వెళ్ళిందే ఇంటికి పోరు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రధాన ఆలయాల్లో ట

చిత్తూరు జిల్లాలో టిటిడి ఆధ్వర్యంలో ఉన్న ఆలయాల్లో సిబ్బంది చేతివాటం అంతా ఇంతాకాదు. కొంతమంది ఉద్యోగులు ప్రతిరోజు ఎంతోకొంత తీసుకుని వెళ్ళిందే ఇంటికి పోరు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రధాన ఆలయాల్లో టిటిడి సిబ్బంది బాగానే సంపాందిస్తుంటే చిన్న ఆలయాల్లో ఆ ఆదాయం కాస్త తక్కువే. శ్రీనివాసమంగాపురంలో ఇదే పరిస్థితి. 
 
చిత్తూరు జిల్లా సందర్శనకు వచ్చే భక్తుల్లో ఎంతోకొంతమంది శ్రీనివాసమంగాపురంకు వెళుతుంటారు. శ్రీనివాసమంగాపురంలో ఉన్న స్వామిని చూస్తే అంతా తిరుమల శ్రీవారిలాగా ఉంటారనేది భక్తుల నమ్మకం. అందుకే భక్తులు తిరుమల దర్శనం తర్వాత శ్రీనివాసమంగాపురంకు కూడా వస్తుంటారు.  ఎంతో భక్తిభావంతో ఈ ఆలయానికి వచ్చే భక్తులను నిలువుదోపిడీ చేసేస్తున్నారు టిటిడి సిబ్బంది. 
 
భక్తులను సిబ్బంది నేరుగా టేకప్‌ చేయరు. బయట దీనికో బ్యాచ్‌ ఉంటుంది. వారు భక్తులతో రేటు మాట్లాడి ఆలయంలోని టిటిడి సిబ్బందికి అప్పజెబుతారు. అందరూ ఇలాంటి పాపపు పనులు చేస్తారనుకోవద్దు. ఎవరో కొంతమంది మాత్రమే చేస్తారు. బయటి వ్యక్తులు మాట్లాడుకున్న దాంట్లో ఆలయ సిబ్బందికి 70 శాతం మిగిలింది వారికే. అలా వారి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారు.
 
టిటిడి సిబ్బంది తీసుకెళ్లే భక్తులకు టిక్కెట్లు కూడా కొనరు. మా వాళ్ళు.. మావాళ్లూ అంటూ ఆలయంలోకి తీసుకెళ్ళిపోతుంటారు. ఎవరూ కూడా పట్టించుకోరు. ఎందుకంటే అందరికీ తెలిసిందే కాబట్టి. ఇలా టిటిడి ఆదాయానికి కూడా సిబ్బంది గండి కొట్టేస్తున్నారు. వచ్చిన భక్తులకు ప్రసాదాలు అన్నీ సపర్యలు చేసి పంపుతారు. డబ్బులు మాత్రం సిబ్బంది తీసుకోరు. బయట గేటు దాటిన తర్వాత బయట మాట్లాడిన వ్యక్తి రెడీగా ఉంటాడు. అంతా ఇక అతని చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. ఇది ఇప్పటికికాదు ఎంతో కాలంగా జరుగుతూ ఉంది.
 
టిటిడి ఉన్నతాధికారులకు ఈ విషయం తెలుసు. అయినా ఒకరైతే చర్య తీసుకోవచ్చు. టిటిడి సిబ్బందిలో సగానికిపైగా వారే ఉండడంతో ఏం చేయాలో తెలియక సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న ఈఓ సాంబశివరావు దీనిపై స్పందించాలని భక్తులు కోరుతున్నారు.