Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లంకలో హనుమంతుడు ఎడమకాలు ఎందుకు పెట్టాడంటే...?

మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (12:31 IST)

Widgets Magazine
hanuman

నూతన వధువు వరుడుతో కలిసి తన అత్తవారింటిలోకి ముందుగా కుడికాలు పెడుతూ గృహప్రవేశం చేస్తుంది. కుడికాలు మోపుతూ ఇంట్లోకి రావడం వలన సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
ఈ కారణంగానే ఇది తరతరాలుగా ఆచారంగా వస్తోంది. ఇక కేవలం అత్త వారింటికి కోడలు వచ్చే విషయంలోనే కాదు ... ఎవరి బాగు కోరతామో వారి ఇంటికి కుడిపాదాన్ని మోపుతూ ప్రవేశించాలని అంటారు.
 
కుడి పాదం మోపకుండా ఎడమ పాదం మోపుతూ ప్రవేశించడం వలన అక్కడ నిరంతరం గొడవలు ... సమస్యలు కలిసి కాపురం చేస్తాయని పండితులు అంటున్నారు. ఈ కారణంగానే గొడవకి సిద్ధపడి వచ్చేవారు ముందుగా ఎడమపాదం మోపుతూ వస్తారని తెలుస్తోంది. 
 
సీత అన్వేషణలో భాగంగా హనుమంతుడు లంకానగరానికి చేరుకున్నప్పుడు ఈ విషయాన్ని గురించే కాసేపు ఆలోచించాడట. తాను కుడిపాదం మోపుతూ లోపలి ప్రవేశించడం వలన రావణాసురిడికి సకల శుభాలు జరుగుతాయని భావించి, ముందుగా ఎడమ పాదాన్ని మోపుతూ లోపలికి వెళ్లాడట. కాబట్టి ఎక్కడైతే సఖ్యతను, సంతోషాన్ని,. సంపదను ఆశిస్తామో, అక్కడికి కుడికాలు ముందుగా మోపుతూ వెళ్లాలని శాస్త్రాలు చెబుతున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

మంగళవారం పూట హనుమాన్ జయంతి.. మారుతిని పూజించండి

నేడు (ఏప్రిల్ 11) హనుమాన్ జయంతి. మంగళవారం పూట వచ్చిన ఈ హనుమాన్ జయంతి రోజున రామనామ జపం ...

news

విదుర నీతి సందేశం... గర్వంతో సకలమూ నాశనం...

ముదిమితో చక్కదనం పోతుంది. ఆశలు పెరిగితే ధైర్యం చెడిపోతుంది. మృత్యువుతో ప్రాణాలు పోతాయి. ...

news

ప్రకృతి - దైవానికి మధ్య ఉన్న వ్యత్యాసమేమిటో తెలుసా...?

భగవానుడు అత్యంత సృజనాత్మక ప్రతిభతో ఈ భువిపై ప్రకృతిని తీర్చిదిద్దాడు. మాతృమూర్తి ...

news

తితిదే 10 వారాల ప్రయోగం... శ్రీవారి బ్రేక్ దర్శనాల్లో ప్రయారిటీ లేదట

తిరుమల శ్రీవారి దర్శనంలో బ్రేక్ ముఖ్యమైనది. సాధారణంగా టిటిడి ఎల్-1, ఎల్-2, ఎల్ -3 ...

Widgets Magazine