హోమం ఎందుకు చేస్తారంటే?

యాగం అంటే ఒక పెద్ద క్రతువు. వేదకాలంలో మాత్రమే సాధ్యమయ్యే ఆచారం. పురాణాలలో అనేకమైన ప్రస్తావనలు కనిపిస్తుంటాయి. పూర్వకాలంలో శుంభ, నిశుంభలు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు, చండి అవతారాన్ని ధరించారు

Kowsalya| Last Updated: మంగళవారం, 3 జులై 2018 (21:49 IST)
యాగం అంటే ఒక పెద్ద క్రతువు. వేదకాలంలో మాత్రమే సాధ్యమయ్యే ఆచారం. పురాణాలలో అనేకమైన ప్రస్తావనలు కనిపిస్తుంటాయి. పూర్వకాలంలో శుంభ, నిశుంభలు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు, చండి అవతారాన్ని ధరించారు. తన శౌర్యంతో ఆమె శుంభ, నిశుంభులనే కాకుండా వారి సేనాధిపతులైన చండముండాసురులను కూడా సంహరించింది. 
 
మార్కండేయ పురాణంలో దుర్గాదేవిని స్తుతిస్తూ సాగే ఏడువందల శ్లోకాలు స్తుతిని దుర్గాసప్తశతి అంటారు. దీనికే చంటీసప్తశతి అని పేరు కూడా వచ్చింది. హోమగుండంలో అగ్నిప్రతిష్టను గావించి ఈ దుర్గాసప్తశతి మంత్రాలను జపించడంతో చండీయాగం సాగుతుంది. చండీదేవికి ప్రీతిపాత్రమైన నవాక్షరి వంటి మంత్రాలను కూడా ఈ సందర్భంగా జపిస్తారు. 
 
ఈ యాగంలో ఎన్నిసార్లు దుర్గాసప్తశతిని వల్లెవేస్తూ అందులోని నామాలతో హోమం చేస్తారో దానిని బట్టి శత చండీయాగం, సహస్ర చండీయాగం, ఆయుత చండీయాగం అని పిలుస్తారు. పూర్వం రాజ్యం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని, ఆపదలు తొలగిపోవాలని, శత్రువులపై విజయం సాధించాలని చండీయాగం చేసేవారు. 
 
రాచరికాలు పోయినా, చండీయాగం పట్ల నమ్మకం మాత్రం ఇంకా స్థిరంగానే ఉంది. అందుకే ఇప్పటికి స్తోమత ఉన్నవారు, రాజకీయ నాయకులు ఈ యాగాన్ని తలపెడుతూ ఉంటారు. కొందరు సంపన్నులు ఇండ్లలో కూడా చండీయాగం చేయిస్తుంటారు.దీనిపై మరింత చదవండి :