బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 2 ఫిబ్రవరి 2015 (17:45 IST)

కర్మంటే నమ్మొద్దు... యోగాతో కర్మ ఫలాన్ని తగ్గించుకోండి!

నువ్వు ఏదో తప్పు చేసి వుంటావు. అందుకే ఇన్ని బాధలు అంటూ మీలో ఒక న్యూనతా భావాన్ని నింపటానికి కర్మ అంటూ మాట్లాడే వాళ్ళను ఎవరినీ నమ్మొద్దు. వాళ్లు చెప్పేది అసలు నమ్మకండి. లెక్కలోకి తీసుకోకండి. 
 
అయితే ప్రకృతి తనకంటూ కొన్ని విధులు ఏర్పరుచుకుని మీరు నమ్మితీరాలి. అన్నీ మీరనుకున్నట్లే అలాగే జరిగితే మీకు నిర్లక్ష్యం ఏర్పడుతుంది. జీవితాన్ని లెక్కలోకి తీసుకోరు. మిమ్మల్ని మీరే దేవుడిగా అనుకుంటారు. అందుకే ప్రకృతి అప్పుడప్పుడు మీ నెత్తిన మొడుతుంది. 
 
ఒక కట్టడం గోడలకు పగుళ్ళు వస్తే తప్పు ఎక్కడ జరిగిందని తెలుసుకోవడానికి ప్రయత్నించాలే తప్ప పగుళ్ళను మాత్రం సిమెంట్ పూసి పూడ్చటం వల్ల లాభం లేదు. అలాంటిదే నమ్మకంతో చికిత్స కూడా. 
 
కర్మ ఫలాన్ని తగ్గించడానికి యోగా, పరిపూర్ణ ధ్యానం వంటివి ఎన్నో ఉన్నాయి. అవి బాగా నేర్చుకుని వాటిని ఉపయోగిస్తే అందరూ తమ తమ శక్తి కేంద్రాల్ని సరిగా పనిచేసే శక్తి అలవరుచుకోవచ్చు.