గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By WD

శృతి మించిన విశ్వాసం

WD PhotoWD
భక్తులు తమ నాలుకను, రక్తాన్ని 'శక్తి'మాతకు సమర్పికుంటారు.

విశ్వాసానికి లోనైన మనిషి దాని ప్రభావంతో ఏదైనా చేస్తాడు... ఏది నిజం శీర్షికలో భాగంగా, నవరాత్రి దినాలలో శక్తిని పూజించే సమయంలో విశ్వాసం చూపే ప్రభావాన్ని మీకు పరిచయం చేస్తున్నాము... భక్తి భావనకు లోనైన భక్తులు తమ శరీరాన్ని గాయపరుచుకోవడం ద్వారా దేవతకు పూజ చేస్తారు. మరికొన్నిసార్లు అసాధారణమైన పనులకు పూనుకుంటారు.

సాధారణ దినాలలో 'శక్తి'మాతను కొలిచే భక్తుల భావోద్వేగాలు తగు మోతాదులో ఉంటాయి. అదే నవరాత్రి దినాలలో అయితే భక్తుల భావోద్వేగాలు హద్దులు దాటుతుంటాయి. మనస్సు, తనువు వారి అదుపులో ఉండవు.

మొదటగా ఇండోర్‌లోని దుర్గామాత దేవలయానికి మేము చేరుకున్నాము. ఇక్కడి దేవాలయ పూజారి ఒంట్లోకి దుర్గామాత వస్తుందని చెప్పుకుంటారు.
WD PhotoWD
దేవాలయంలో వాతావరణం చూసి మేము దిగ్భ్రాంతికి లోనయ్యాము. నోట్లో వెలుగుతున్న కర్పూరం, చేతిలో ఖడ్గంతో భక్తుల మధ్య గంతులు వేస్తున్న దేవాలయ ప్రధాన పూజారి మాకు దర్శనమిచ్చాడు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దుర్గామాత అవతారంగా భావించిన భక్తులు అతనికి పూజలు చేస్తున్నారు. అలా పూజలు చేస్తున్న వారిలో కొందరు వ్యాపారస్థులు మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అన్ని కులాలకు చెందిన భక్తులు మనకు అక్కడ కనిపిస్తుంటారు.

WD PhotoWD
కొన్ని సంవత్సరాలుగా దుర్గామాత తన ఒంట్లోకి వస్తుందని దేవాలయ పూజారి సురేష్ బాబా మాతో అన్నాడు. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర్‌ను సందర్శించగా అతనికి ఇది వరప్రసాదితమైంది. అతని వద్దకు వచ్చిన వారిని దుర్గామాత ఖాళీ చేతులతో పంపక వారి కోరికలను తీరుస్తుంది.

తరువాత మేము ఇండోర్-ధార్ రోడ్డులోని గ్రామానికి చేరుకున్నాము. ఆ గ్రామంలోని కొలను దగ్గర జరుగుతున్న 'శక్తి' పూజ భయానకంగా ఉంది. కొందరు మహిళలు కత్తితో తమ నాలుకలను కత్తిరించుకుంటున్నారు... ప్రజలు పలు రకాలుగా తమని తాము గాయపరుచుకుంటున్నారు.

ఇటువంటి సంఘటనలు మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో జరుగుతుంటాయి... కొందరు ప్రజలు తమను దుర్గామాత అవతారంగా భావించుకుంటారు. మరి కొందరు ప్రజలు తమను కాళీమాత అవతారంగా చెప్పుకుంటారు. ఈ రకమైన భక్తిభావన ఇప్పుడు విపత్కర రూపాన్ని సంతరించుకుంది. భక్తిలో మునిగి తేలే ఈ
WD PhotoWD
భక్తులు దేవతామూర్తికి తమ రక్తాన్ని నైవేద్యంగా సమర్పించుకోవడం ప్రారంభించారు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇప్పుడిక అత్రిమాత దేవాలయానికి వెళదాం పదండి. ఈ దేవాలయం నీమచ్‌కు 60 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడి కాళీమాతకు నాలుకను సమర్పించుకుంటే, తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. వేల సంఖ్యలో భక్తులు తమ నాలుకను దేవతామూర్తికి సమర్పించుకున్నారని పూజారి నమ్మబలికాడు.
WD PhotoWD
మనోహర్ స్వరూప్ అనే భక్తుడు తన నాలుకను సమర్పించుకోవడాన్ని చూశాము. వివాహం జరిగి 12 సంవత్సరాలు కావొస్తున్న మనోహర్‌కు సంతానప్రాప్తి కలగలేదని అతని సోదరుడు మాతో అన్నాడు. తనకు సంతానం కలిగితే అత్రిమాతకు నాలుకను సమర్పించుకుంటానని మనోహర్ మొక్కుకున్నాడు. అతని కోరిక తీరింది, దాంతో మొక్కు తీర్చుకుందామని మనోహర్ ఇక్కడకు వచ్చాడు.

మా కళ్లముందే అతడు తన నాలుకను అత్రిమాతకు సమర్పించుకున్నాడు. మనోహర్ వలె అనేక మంది భక్తులు తమ నాలుకను మాతకు సమర్పించుకుంటున్నారు. నాలుకను సమర్పించుకున్న అనంతరం కొంతకాలం ఈ దేవాలయంలో ఉండాలని భక్తుల విశ్వాసం. దేవాలయంలో 8 నుంచి 10 రోజులు ఉన్న తర్వాత, నాలుకను సమర్పించిన వారు తమ గాత్రాన్ని తిరిగి పొందుతారు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దేవాలయంలో 10 రోజులు గడిపిన అనంతరం తనకు మాట వచ్చిందని ప్రభాత్ దేవ్ అనే భక్తుడు మాతో అన్నాడు.

అత్రిమాతకు నాలుకను సమర్పించుకోవడాన్ని ప్రత్యక్షంగా చూసిన మాకు మతి పోయినంత పనైంది. హఠాత్తుగా అనేక సందేహాలు మా మెదడులో
WD PhotoWD
తలెత్తాయి...ఎవరైతే తమ దేహాన్ని గాయపరుచుకుంటారో వారికి దుర్గామాత ప్రసన్నురాలవుతుందా?

ఇటువంటి పనులు వారి కోరికలను తీరుస్తాయా? ఉన్మాదులను పోలినట్లు ఊగిపోతున్న ప్రజలలోకి మానవాతీత శక్తులు ప్రవేశిస్తాయా? ఈ ప్రశ్నలుకు ఎంత వెతికినా మా దగ్గర సమాధానం దొరకలేదు...మీరేమని అనుకుంటున్నారో దయ చేసి మాకు రాసి పంపండి...