అతీంద్రియ శక్తిని తలపించే.. దేవాస్ మహాకాళేశ్వరుడు

WD PhotoWD
భక్తుల సంక్షేమం కోసం భగవంతుడు వారి ఎదుట ప్రత్యక్షమవుతాడా? ఒక ప్రతిమ మానవుని వలె పెరుగుతుందా? నిజ జీవితంలో ఇటువంటి అద్భుతాలు సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు జవాబులు ఎవ్వరికీ తెలియవు. కానీ ప్రతి ఒక్కరూ అతీంద్రియ శక్తుల తాలూకు ఆశ్చర్యం కలిగించే అంశాలను చవిచూసి ఉంటారు.

కొన్నిసార్లు చెట్టులోను లేదా మరికొన్నిసార్లు ప్రసాదం (దేవుడికి నివేదించేది)లోనూ ప్రజలు వీక్షించే దేవుడు, వారి ఎదుటనే అదృశ్యమవుతాడు. "ఏది నిజం" పరంపరలో భాగంగా ఆశ్చర్యాలకు పేరొందిన దేవాలయాన్ని మేము చేరుకున్నాము. ఈ వృత్తాంతాన్ని చదవిన అనంతరం అది విశ్వాసం లేదా ఖచ్చితంగా మూఢనమ్మకం అనేది మీరే నిర్ణయించండి.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

PNR|
'ఏది నిజం' విభాగంలోని ప్రస్తుత ఎపిసోడ్‌లో, దేవాస్‌ మహాకాళేశ్వర దేవాలయాన్ని మీ ముందుంచుతున్నాము. వేలకొలది భక్తుల విశ్వాసాన్ని ఈ దేవాలయం
WD PhotoWD
ఆపాదించుకున్నది. ఈ దేవాలయంలోని శివలింగం స్వయంభువుగా అవతరించడమే గాక లింగం యొక్క ఎత్తు క్రమక్రమంగా పెరుగుతున్నదని దేవాలయానికి సమీపంలో నివసించేవారు మరియు నిత్యం విచ్చేసే భక్తులు నొక్కి చెప్తున్నారు. వారి మాటలలోని యదార్ధం తెలుసుకునేందుకు మేము స్థానికులతో మాట్లాడాము.దీనిపై మరింత చదవండి :