ఏరులై పారుతున్న నెయ్యి

WD PhotoWD
నదిలా ప్రవహిస్తున్న నెయ్యిని మీరెప్పుడైన చూసారా? మీ సమాధానం లేదనే వస్తుంది. శ్రీరాముని రాజ్యంలో పాలు, నెయ్యి నది ఉండేవని మన పెద్దలు అంటుండేవారు. కానీ ఆ కాలంలో వలె ఇప్పటి ఆధునిక కాలంలో సైతం అటువంటి నదిని గుజరాత్‌లోని రూపాల్ గ్రామంలో మేము కనుగొన్నాము. ఈ వారం ఏదినిజం విభాగంలో రూపాల్ గ్రామంలో 6 లక్షల కిలోల నెయ్యిని భక్తులు ఉత్సవమూర్తికి సమర్పించే వైనాన్ని పరిచయం చేస్తున్నాం.

మీరు నమ్మినా నమ్మకపోయినా నెయ్యి సమర్పణ కార్యక్రమానికి రూ. 10 కోట్లు ఖర్చు అవుతుందనేది కాదనలేని వాస్తవం. ప్రతిసంవత్సరం నవరాత్రి ఉత్సవాల తొమ్మిదవ రోజున మాతా అధ్యశక్తి వరదాయిని ఊరేగింపును రూపాల్ గ్రామ ప్రజలు భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు. ఊరేగింపులో భక్తులు వేలసంఖ్యలో పాల్గొని
WD PhotoWD
అమ్మవారికి నెయ్యిని నివేదిస్తుంటారు. అలా చేయడం వలన అమ్మవారు తమ కోరికలను తీరుస్తుందని అక్కడి ప్రజల విశ్వాసం.


సాధారణంగా బట్టలపై నేతి మరకలను శుభ్రం చేయడం శ్రమతో కూడుకున్న పని, కానీ ఊరేగింపు సమయంలో నెయ్యిలో ముంచినట్లుగా మారిన తమ బట్టలపై పేరుకుపోయిన నెయ్యి చాలా సులువుగా తొలగిపోతుందని వారు చెపుతుంటారు. వారి మాటల్లో సత్యమెంతో తెలుసుకునేందుకు మేము రూపాల్ గ్రామానికి వెళ్ళాం.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

PNR|
ఆ గ్రామంలో పల్లి మహోత్సవం పేరిట నవరాత్రి తొమ్మిదవరోజు అధ్యశక్తి వరదాయిని అమ్మవారి రథోత్సవం జరుగుతుంటుంది. మేము అక్కడకు చేరుకోగానే భారీ స్థాయిలో భక్త జనసందోహం మాకు కనిపించింది. గ్రామపెద్ద చెప్పినదానిని అనుసరించి 10 లక్షల మంది భక్తులు రూపాల్ గ్రామానికి విచ్చేసారు. 'ఖేఛ్రా' (ఊరేగింపు సందర్భంగా తయారు చేసే సాంప్రదాయ వంటకం) తయారీలో తలెత్తిన జాప్యంతో అర్థరాత్రి 12.00 గంటలకు ప్రారంభం కావలసిన ఊరేగింపు తెల్లవారుఝూము 03:30 గంటలకు బయలుదేరింది.


దీనిపై మరింత చదవండి :