కొత్త జీవితాలను ప్రసాదించే రామాయణ పారాయణం

WD
ఏదినిజం శీర్షికలో భాగంగా ఈసారి మిమ్మల్ని మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో తివాడియా అనే కుగ్రామానికి తీసుకుని వెళుతున్నాం. ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత వుంది. ఇక్కడ నివశించే ప్రతి పౌరుడు శ్రీరామచంద్రుని భక్తుడై వుంటాడు. అంతేకాదు శ్రీరాముడు తమ జీవితాలలో కొత్త వెలుగును నింపాడని వారు నమ్ముతారు.

సుమారు 14 ఏళ్లకిందట ఈ గ్రామం అనేక రకాల వ్యాధులతో... కరువు కాటకాలతో సతమతమవుతుండేది. అదేమి చిత్రమో... ఆ గ్రామంలో నెలకొని వున్న సిద్థ హనుమంతుని దేవాలయంలో అఖండ రామాయణ పారాయణం చేయడంతో సకల కష్టాలు తొలగిపోయి సుఖసంతోషాలు వెల్లివిరిశాయి. అఖండ రామాయణ పారాయణం చేసేటపుడు ఆలయంలో అఖండ జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతుంటుంది.
అదంతా రామాయణ పారాయణ మహిమే
  అఖండ రామాయణం ప్రారంభించినంతనే ఆశ్చర్యంగా నీరు పైకి ఉబికి వచ్చి 30 నుంచి 40 అడుగుల మధ్యనే లభ్యమైందనీ... కొన్ని ప్రాంతాల్లో కేవలం 5 అడుగులకే నీరు లభించటం నిజంగా ఆ శ్రీరామ చంద్ర మహిమేనన్నాడు      


అఖండ రామాయణ పారాయణం గురించి ఆలయ పూజారి ధర్మేంద్ర మాట్లాడుతూ.... ఎవరైతే అఖండ రామాయణంలో పాల్గొంటారో వారి జీవితాల్లో వచ్చిన మార్పును స్పష్టంగా తాను గమనించానన్నాడు. అంతేకాదు అఖండ రామాయణ మహిమలు ఎన్నో వున్నాయన్నారాయన.

ఆ గ్రామంలో నీటి మట్టం సుమారు 300 అడుగుల లోతున వుండేదనీ... అఖండ రామాయణం ప్రారంభించినంతనే ఆశ్చర్యంగా నీరు పైకి ఉబికి వచ్చి 30 నుంచి 40 అడుగుల మధ్యనే లభ్యమైందనీ... కొన్ని ప్రాంతాల్లో కేవలం 5 అడుగులకే నీరు లభించటం నిజంగా ఆ శ్రీరామ చంద్ర మహిమేనన్నాడు.

ఓ గ్రామస్తుడు చెప్పినదాని ప్రకారం... అఖండ రామాయణ పారాయణం చేసే ప్రతి భక్తుడు అత్యంత భక్తి శ్రద్ధలతో రామచంద్రుని కీర్తించాలి. ఇలా చేసినవారు ప్రతి ఒక్కరు తమ జీవితాల్లో సుఖసంతోషాలను పొందారని మాతో చెప్పాడతను.
WD


ఆలయ పూజారి ధర్మేంద్ర వ్యాస్ ఇలా చెప్పుకొచ్చాడు. నవరాత్రి సమయంలో ఓ పెను తుఫాను ఆలయాన్ని అతలాకుతలం చేసింది. చిత్రంగా... దేవాలయంలో రామాయణ పారాయణం చేసేవారికి ఎటువంటి హానీ కలుగలేదు. అలాగే గోరేలాల్ అనే మానసికరోగి రామాయణ పారాయణంతో మామూలు మనిషయ్యాడని చెప్పాడు.

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
కేవలం రామాయణ పారాయణం చేసినంతనే ఓ పిచ్చివాడు మామూలు మనిషి అయ్యే అవకాశం వుందా...? రామాయణ పారాయణానికి నీటి మట్టాన్ని పెంచే శక్తి వుందంటారా...? మీరు దీనిని నమ్ముతున్నారో లేదో దయచేసి మాకు రాయండి.


దీనిపై మరింత చదవండి :