దయ్యాల బెడదను వదిలించే మురికినీటి స్నానం

Women in unconcious
Shruti AgarwalWD
చేతబడుల లోయగా పేరొందిన హుస్సేన్ టేక్రీలోని మురికి నీటిలో స్నానం చేయడంతో భూత, ప్రేత, పిశాచాల బెడద తొలగిపోతుందని కొందరి విశ్వాసం. దీనిని ఆచరిస్తున్న వారిని మేము కళ్లారా చూశాం. ఆ ప్రాంతానికి మేము ఉదయం 7.00 గంటలకు చేరుకున్నాము. ప్రవేశ ద్వారం వద్ద అసహజ స్థితిలో ఉన్న ఇద్దరు స్త్రీలను మేము చూశాం.

ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జమునా బాయి మరియు కౌసర్బీగా పిలవబడే ఆ ఇద్దరు స్త్రీలు మా ముందు “అరె బాబా రే...” అంటూ అరవడం ప్రారంభించారు. జమున భర్త మాతో మాట్లాడుతూ “ గత కొద్ది రోజులుగా జమున ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చింది. మతిభ్రమించి పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నది. ఆమెకు దయ్యం ఆవహించినందున ఇక్కడకు రావలసిందిగా ఒక పూజారి మాకు సలహా ఇచ్చారు.”

ఇంకా ఆయన తన సంభాషణను కొనసాగిస్తూ “ ఆమెకు స్వస్థత చేకూర్చే నిమిత్తం రెండు వారాల క్రితం మేమిక్కడికి వచ్చాము. మొదటిరోజు చికిత్స నుంచి ఆమె ఏడవడం ప్రారంభించింది. ఐదు “జుమ్మాస” అనంతరం ఆమె మామూలు మనిషి అవుతుందని ఆశిస్తున్నాము.”
People tying sacred thread
Shruti AgarwalWD


తరువాత మేము హజ్రత్ ఇమామ్ యొక్క “రోజ” ( ముస్లింలు పవిత్రంగా భావించే సమాధులు లేని ప్రాంతం) లోనికి ప్రవేశించాము. అక్కడి వాతావరణం మమ్మల్ని విభ్రాంతికి గురి చేసింది. దృఢమైన గొలుసులతో కట్టివేయబడిన స్త్రీ, పురుషులు అక్కడ పెద్దగా రోదిస్తూ కేకలు వేస్తూ కనిపించారు. అక్కడి వాతావరణం భీభత్సంగా ఉంది.

Venkateswara Rao. I|
మీరు చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? ఇక్కడ క్లిక్ చేయండి


దీనిపై మరింత చదవండి :