నీటితో వ్యాధిని మాయం చేస్తా...

WD
ఏదినిజం శీర్షికలో భాగంగా మరో వింతైన అంశాన్ని మీకు పరిచయం చేయబోతున్నాం. ఈ వింత విద్యను నిర్వహించే సదరు వ్యక్తి పేరు ఇందిరాదేవి. న్యూఢిల్లీకి చెందిన ఈమె తన వద్దనున్న పవిత్రజలంతో ఎటువంటి రోగాన్నైయినా పారదోలతానంటోంది. క్యాన్సర్, ట్యూమర్… ఇతర ఎటువంటి భయంకరమైన జబ్బులనైనా నయం చేస్తానంటోంది. తనకున్న దివ్యశక్తులతో ఇది సాధ్యమవుతోందని తన అనుచరగణానికి చెపుతోంది.

రోగులకు ఆమె చేసే చికిత్స కూడా విభిన్నంగా ఉంటుంది. రోగిని తన ఇంటివద్ద నుంచి నీటిని తీసుకురమ్మంటుంది. అదే జలాన్ని రోగగ్రస్తమైన ప్రదేశంలో చిలకరిస్తుంది. ఈ తంతు ముగిసిన తర్వాత రోగి ఆ నీటిని తాగేయాలి. రోగి ఈ నీటితోపాటు పూవులు, అరటిపండ్లు వంటివాటిని తీసుకోవాలి. అంతేకాదు రోగి శరీరంపైన తడిపూవులను బాగా రుద్దుతుంది.

ఆమె చికిత్సను పొందటానికోసం రకరకాల మనుషులు, రకరకాల వ్యాధి బాధలతో ఆమె గుమ్మం ముందు బారులు తీరి సమస్యను వదిలించుకునేందుకు ఎదురుచూస్తుంటారు. తనకు దివ్యశక్తులు ఉన్నాయనీ, అందువల్లనే కేవలం నీటితో చికిత్స సాధ్యమవుతోందని ఇందిరాదేవి ప్రకటించుకుంటుంది. అంతేకాదు ఆమె చేతి స్పర్శతో దుఃఖం, శరీరంలో ఉన్న ఇతర రుగ్మతలు మటుమాయమవుతాయట.
WD


తను చేసే ఏ చికిత్సకు రోగుల వద్ద ఎటువంటి రుసుము తీసుకోనని చెపుతోంది ఇందిరాదేవి. అయితే ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న వ్యవహారం మరో రకంగా కనబడుతోంది. ఈ విషయంపై ఆమెను ఆరాతీస్తే, రోగులు తమకు తాముగా రూ.20 నుంచి రూ.50 చెల్లించే డబ్బు విషయమై తానేమే చేయలేననీ అంటోంది. అయినా ఇందులో తప్పేముంది.. వారి రోగం నయమవటానికంటూ ఓ ఇరవయ్యో యాభయ్యో ఇస్తున్నారంతే అంటోంది.

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
WD
ఇలా రోగి, రోగి తరపు కుటుంబం నీటి చికిత్సకోసం వస్తూ ఉంటారు. వారికి ఇందిరాదేవి చికిత్స చేస్తూ ఉంటుంది. అయితే ఒకే రోగిని చికిత్సలో భాగంగా ఆమె అనేకసార్లు పిలుస్తుంటుంది. వారు కూడా వస్తుంటారు. అయితే నేటివరకూ ఆమె చేసే చికిత్స ఫలవంతమైనదా.. లేదా అని చెప్పేటందుకు ఖచ్చితమైన సమాచారం లేదు. ఇవన్నీ ప్రక్కనపెడితే.... ప్రజలు ఆమెకున్న దివ్యశక్తులను నమ్ముతూనే ఉన్నారు. ఇటువంటి అతీత శక్తులున్నట్లు మీరు విశ్వసిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి


దీనిపై మరింత చదవండి :