పునాదిలేని తంజావూరు శివాలయం

WD
కింది నుంచి చూస్తే ఆ ఆలయం ఒక పెద్ద కొండలా కనిపిస్తుంది. దాని గోపురం ఎత్తు 216 అడుగులు. ఇంత ఎత్తైన దేవాలయం కోసం ఎంత లోతు పునాది తీశారో అనుకుంటాం. ఇది సహజం. కాని ఆ దేవాలయానికి అసలు పూనాదే లేదు. నమ్ముతారా ? ఎవరు నమ్మినా.. నమ్మకపోయినా.. ఇది నిజం.

ఇంత ప్రత్యేకత ఉన్న ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఉంది. మేరు పర్వతంలాంటి ఎత్తైన ఈ కట్టడం కళలు, ఆధ్యాత్మికతకే కాదు, వెయ్యేళ్ళ కిందటి నిర్మాణ నైపుణ్యతకు అద్దం పడుతోంది. ఇంత వరకూ ఈ నిర్మాణం చెక్కు చెదరలేదు. ఇలా ఒకటి కాదు. రెండు కాదు. వెయ్యేళ్లుగా అలాగే ఉంది. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

క్రీస్తు శకం 1003-09లో ఆ ప్రాంత రాజు అయిన రాజరాజ చోళుడు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ పవిత్ర దేవాలయంలోనికి ప్రవేశించగానే 13 అడుగుల ఎత్తు ఉన్న శివలింగం కనిపిస్తుంది. ఐదు పడగల నాగేంద్రుని నీడన శివలింగ రూపంలో పరమేశ్వరుడు దర్శనమిస్తారు. ఈ మొత్తం నిర్మాణంలోకి ఇది ఒక అద్భుత దృశ్యం.
WD


K.Ayyanathan|
దీని చుట్టూ ఆరడుగులు ఖాళీ ఉండేటట్లు రెండు వెడల్పాటి గోడలను నిర్మించారు. వెలుపలి గోడపై ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కళా సంపదను సమకూర్చారు. చతురస్రాకారంగా ఉన్న ఈ నిర్మాణం ఒకటికిపైగా చదరపు మీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. ఈ నిర్మాణాన్ని మొత్తం రాతితోనే కట్టారు. ఈ రెండు ప్రహారీల మధ్య ఉన్న విరామమే ఈ భారీ నిర్మాణ అందానికి కేంద్రబిందువు.


దీనిపై మరింత చదవండి :