మానవ శరీరంలో దేవత

PNR|
మానవ శరీరంలో అమ్మవారి ప్రతిరూపాన్ని మీరెప్పుడైనా చూశారా...? అమ్మవారు తనలో ప్రవేశించిందిని చెప్పుకునే వ్యక్తి, కణకణలాడే నిప్పులపై నడువగలడా...? ఏదినిజం శీర్షికలో భాగంగా ఈసారి మిమ్మల్ని అటువంటి వ్యక్తుల గురించి పరిచయం చేయబోతున్నాం. వారంతా చెప్పేదేమిటంటే అమ్మవారు తన భక్తులకు సహాయపడేందుకు వారివారి శరీరాలలోకి ప్రవేశిస్తుందట.

ఈ నిజం మీకు తెలియజేయటానికి మిమ్మల్ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలోని ఓ దేవాలయం వద్దకు తీసుకువెళుతున్నాం. ఇక్కడ కొలువై ఉన్న దుర్గాదేవి ఆలయంలో, అమ్మవారికి ప్రార్థన చేసే సమయంలో దేవి కొందరి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అమ్మవారు ప్రవేశించిన స్త్రీలు లేదా పురుషులను టైగర్ లేదా కాల భైరవునిగా సంబోధిస్తారు. ఇలా అమ్మవారు పూనిన వ్యక్తుల ప్రవర్తన అసాధారణంగా ఉంటుంది.

వారంతా తమతోపాటు దుర్గామాతను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను దీవిస్తుంటారు. దుర్గామాత తమ శరీరాన్నంతా ఆవహించిందని భావించినవారు అమ్మవారి లీలా విశేషాలకు గుర్తుగా తమ నాలుకలపై మండుతున్న కర్పూరాన్ని ఉంచుకుంటారు. మరికొందరైతే మండుతున్న హారతి కర్పూరాన్ని తమ అరచేతులపై పెట్టుకుంటారు.


దీనిపై మరింత చదవండి :