ముఖం చూసి మనిషిని అంచనా వేయగలమా...?!

WD
రోజువారీ జీవితంలో మనం వందలాది ప్రజల ముఖాలను చూస్తుంటాము. వారిలో సుందర వదనాలు, చిరునవ్వులు ఒలికించే వదనాలు, గంభీర వదనాలు, చంద్రబింబంలా గుండ్రంగా ఉండే ముఖాలను లేదా నలుచదరపు ముఖాలను లేదా కోలముఖాలను ఇలా అనేక ముఖ రూపాలను మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ముఖ రూపాలు దేన్నయినా స్పురింపజేస్తున్నాయా? వారి ముఖాన్ని చదవటం ద్వారా మనం వారి వ్యక్తిత్వాలను అంచనా వేయగలమా?

అంచనా వేయగలం అంటున్నారు. ఈ భావనపై ప్రపంచ వ్యాప్తంగా బలంగా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. చార్లెస్ లెబ్రన్ పేరు గల ఫ్రెంచ్ చిత్రకారుడు చిత్రించిన ఈ చిత్రాలను చూడండి. 17వ శతాబ్దంలో (1619-1690 పద్నాలుగవ లూయిస్ రాజు ఆస్థానంలో తొలి పెయింటర్‌) ఇతను జీవించాడు. ఇతడు గీసిన చిత్రాలను తంజావూరులోని సరస్వతి మహల్ లైబ్రరీలో కనిపిస్తాయి. ఇతడు కొన్ని ముఖాలను చిత్రించాడు. కానీ వాటి కింద చాలా వరకు జంతు ముఖాలు ప్రతిబింబిస్తూండటం గమనార్హం.

చార్లెస్ లె బ్రన్ మనుషుల ముఖాలను వారి వ్యక్తిత్వాలను అధ్యయనం చేశాడు. ఇతడి అభిప్రాయం ప్రకారం, జంతువును లేదా పక్షిని ప్రతిబింబించే వ్యక్తి ముఖం ఆ జంతువు లేదా పక్షి యొక్క ఒకటి లేదా రెండు లక్షణాలను ప్రతిబింబిస్తాయంటాడు. అతడి అధ్యయనం, కనుగొన్న అంశాలు పిజయానమీలో అతి ముఖ్య స్థానం సంతరించుకున్నాయి. వ్యక్తి ముఖం మరియు కనిపించే రూపం నుంచి అతడి లేదా ఆమె వ్యక్తిత్వాన్ని నిర్వచించే కళను పిజయానమీ అని పిలుస్తున్నారు.
WD


K.Ayyanathan|
ఉదాహరణకు ఒక వ్యక్తి ముఖం కుక్క ముఖాన్ని ప్రతిబింబిస్తోందంటే, అతడి వ్యక్తిత్వం కుక్కను పోలి ఉంటుందని, అతడి అరుపు కుక్క మొరుగుడు లాగా ఉంటుందని మనం భావించవచ్చా? లేదా కుక్క లక్షణాన్ని అద్భుతంగా కనబరుస్తూ అతడు తన యజమానికి చాలా విశ్వసనీయంగా ఉండగలడని మనం భావించవచ్చా? లేదు.. ఇలాంటి అభిప్రాయానికి వచ్చామంటే అది చాలా అశాస్త్రీయంగా ఉంటుంది.


దీనిపై మరింత చదవండి :