మొండి రోగాల ఆట కట్టించే దేవత...

WD
ఏది నిజం సీరీస్‌లో భాగంగా ఈ వారం మిమ్మల్ని మధ్యప్రదేశ్‌ రాష్ట్రం బర్హాంపూర్ జిల్లాలో ఉన్న విరోదాబాద్ గ్రామంలోని నైమాత ఆలయానికి తీసుకెళుతున్నాం. చూడ్డానికి ఈ గుడి చాలా చిన్నదిగా కనిపిస్తున్నప్పటికీ దీనికున్న విశిష్టత కారణంగా సుదూర ప్రాంతాలనుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. మానసిక వ్యాధులు, ఇతర వ్యాధుల పాలైనవారు లేదా దుష్టశక్తుల బారిన పడి నలిగిపోతున్న వారు చికిత్సకోసం ఇక్కడికి వస్తూంటారు.

నైమాతా ఆలయంలోని దేవత మొండి రోగాల బారినపడి మగ్గుతున్న వారి రోగాలను నయం చేస్తుందని ప్రజల నమ్మకం. వీరి వ్యాధులకు వైద్యులు తగిన చికిత్స చేసి నయం చేయలేకపోవడంతో ప్రజలు నైమాత వద్దకు వస్తున్నారు. రోగులు ఏవి పాటించాలి... ఏవి పాటించకూడదు అనే విషయాలను ఇక్కడ చెబుతూండటంతోపాటు రోగులు డాక్టర్ వద్ద ఎలాంటి చికిత్స కూడా తీసుకోకూడదని ఇక్కడ ఆదేశిస్తూండటం విశేషం. మహారాష్ట్ర నుంచి వచ్చిన రవీంద్ర అనే భక్తుడు మాట్లాడుతూ ఈ ఆలయాన్ని వరుసగా అయిదు మంగళవారాలు దర్శించిన వారు తమ రోగాల బారినుంచి తప్పక బయటపడగలరని చెప్పారు.
నైమాత నాలో పూనుతుంది...
  నైమాతా ఆలయం సమీపంలో సాబ్జాన్ బాయి అనే మహిళ మంత్ర తంత్రాలతో తిరుగులేని పట్టును సాధించుకుంది. నైమాత దేవత తన ఒంటిపై పూనుతుందని, అందుచేత తాను రోగుల వ్యాధులను నయం చేయగలనని చెప్పుకుంటూ ఉంటుంది.      


పూజాకాలంలో నైమాత భక్తులు పాటించవలసిన విధి విధానాల గురించి రకరకాల నమ్మకాలు ఇక్కడ వ్యాప్తిలో ఉన్నాయి. సదాశివ చౌదరి అనే మరో భక్తుడు ఈ ఆలయ విశేషాల గురించి మాట్లాడుతూ... తెల్లరంగులో ఉన్న వండిన ఆహారం తినకూడదని, భక్తులు నలుపు రంగు దుస్తులు ధరించినట్లయితే అలాంటి వారికి హాని కలుగుతుందని చెప్పారు. ఇలాంటి నియమాలను పాటించకపోతే రోగాలు మరింత ముదురుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం.

నైమాతా ఆలయం సమీపంలో సాబ్జాన్ బాయి అనే మహిళ మంత్ర తంత్రాలతో తిరుగులేని పట్టును సాధించుకుంది. నైమాత దేవత తన ఒంటిపై పూనుతుందని, అందుచేత తాను రోగుల వ్యాధులను నయం చేయగలనని చెప్పుకుంటూ ఉంటుంది. దుష్ట శక్తుల బారినపడిన వారు సాబ్జాన్ బాయి పూజలు, వల్లించే మంత్రాల సాయంతో వాటిని వదిలించుకుంటుంటారు. కుష్టు, సంతానం లేకపోవడం వంటి వ్యాధులను కూడా తాను పరిష్కరించగలనని ఆమె చెప్పుకుంటూ ఉంటుంది. రోగాల పాలయిన వారు వైద్యుల వద్దకు పోతే మాత్రం దేవత ఆగ్రహిస్తుందని, అలాంటి వారు చస్తారని ఆమె భయపెడుతుంటుంది.
WD


వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
ఈరోజుల్లో ఆరోగ్యానికి సంబంధించి ప్రతి చిన్న లేదా, పెద్దసమస్యకు డాక్టర్ వద్దకు పరుగెత్తడం మనకు అలవాటుగా మారింది. అయితే, తీవ్రమైన వ్యాధుల బారిన పడి నలుగుతున్న విరోదాబాద్ గ్రామ వాసులు పైన చెప్పినటువంటి మూఢ నమ్మకాల బారిన పడి వైద్య సహాయాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో దయచేసి మాకు రాయండి...


దీనిపై మరింత చదవండి :