రంగులు మార్చే శివలింగం...

WD PhotoWD
రామసేతువుకు తలెత్తిన ముప్పుతో శివలింగం రంగు మార్చుకుంటున్నదా? నమ్మండి నమ్మకపోండి, వారణాసిలోని శివలింగాలకు తోడుగా లక్నో నగరంలోని శివలింగాలు కూడా తమ రంగులను మార్చుకుంటున్నాయి. ఒకేరోజులో శివలింగాలు తమ రంగును మార్చుకున్న వైనం, కొన్ని సంవత్సరాల క్రితం తూర్పు భారతంలో విఘ్నేశ్వరుని విగ్రహాలు పాలు తాగిన ఉదంతాన్ని గుర్తుకు తెస్తుంది.

ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

లక్నోలోని ఛారోధామ్ దేవాలయంలో శివలింగం రంగు మార్చుకున్న సంగతి తెలియగానే, దేవాలయానికి చేరుకున్న అనేక మంది భక్తులు శివలింగానికి పూజలు చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు నల్లరంగులోని శివలింగం తెల్లరంగులోకి మారడంతో ఈ సంఘటన బహుళ ప్రాచుర్యానికి నోచుకుంది. ఈ
WD PhotoWD
సంఘటన భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.


ఈ అద్భుతాన్ని చూసేందుకు పురప్రముఖులలో ఒకరైన కుందన్‌లాల్ జ్యుయలెర్స్ యజమాని అతుల్ అగర్వాల్‌తో పాటు దేవాలయ గౌరవ ధర్మకర్తలు దేవాలయానికి చేరుకున్నారు. చౌపాటియాలో నెలకొన్న ఛారోధామ్ సిధ్ధపీఠ్ దేవాయలయ పూజారి సియారామ్ అవస్థి ఈ సంఘటనను భగవంతుని లీలగా విశ్వసిస్తున్నారు.

PNR|
చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి


దీనిపై మరింత చదవండి :