శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By Shruti Agarwal

అశ్వద్ధామ ఇప్పటికీ సజీవుడై ఉన్నాడా?

Shruti AgarwalWD
ఆసేర్ఘర్ కోట... రహస్యాలకు, సందేహాలకు పెట్టనికోట ... కోటలోని శివాలయం 'మహాభారతంలో ప్రముఖుడు' అశ్వద్ధామచే పూజలందుకున్నదని ప్రతీతి. ఈ నమ్మకాన్ని మేము విన్న వెంటనే, అందులోని నిజానిజాలను తెలుసుకోవాలని ప్రణాళిక వేసుకున్నాము. ఆసేర్ఘర్ కోట, బుర్హాన్పూర్కు 20 కి.మీ.ల దూరంలో ఉంది. ముందుగా కోట సమీపంలో నివసిస్తున్న ప్రజల నుంచి ప్రాధమిక సమాచారాన్ని పోగుచేసాము.

ఫోటో గ్యాలరీ కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి

ప్రతిఒక్కరూ కోటకు సంబంధించి వేర్వేరు కథలను వెల్లడించారు. తమ తాతగారు కోటలో అశ్వద్ధామను అనేకసార్లు ప్రత్యక్షంగా చూసారని కొందరు మాతో అన్నారు. ఒక వ్యక్తి మాతో ఏమి చెప్పాడంటే... కోటలోని కొలనులో చేపలు పట్టడానికి వెళ్లగా, వెనుకనుంచి తనను ఎవరో కొలనులోకి తోసివేసారని తెలిపాడు. కచ్చితంగా అశ్వద్ధామే తనను తోసివేసి ఉంటాడని ఆ వ్యక్తి ప్రగాఢంగా నమ్ముతున్నాడు. ఎందుకంటే కోటలో మరొకరు ఉండే అవకాశం లేదని అతను స్పష్టం చేసాడు.
Shruti AgarwalWD


ఇదిలాఉంటే... అశ్వద్ధామను చూసినవారికి మానసిక సమతుల్యత దెబ్బతింటుందని కొందరు తెలిపారు. వారి నమ్మకాలను విన్న తర్వాత, సందేహాల కోటకు మేము పయనమయ్యాము. ప్రస్తుతం,ఆ కోట రాతియుగానికి నిదర్శనంగా నిలిచి ఉంది. సాయంత్రం ఆరు గంటలు దాటితే చాలు... ఆ కోట భయోత్పాతాలకు నిలయం. మేము కోటను ఎక్కుతుండగా, కొందరు గ్రామస్థులు మమ్మల్మి అనుసరించారు.

మాకు తోడు వచ్చిన వారిలో గ్రామ పెద్ద హరున్ బేఘ్, గైడ్ ముకేష్ గహడ్వాల్ మరియు ఇతర మతస్థులు ఉన్నారు. సాయంత్రం ఆరు గంటలు అయ్యింది. అరగంట తర్వాత కోట ప్రధాన ద్వారాన్ని మేము తట్టాం. ప్రధాన ద్వారం తెరిచే ఉన్నది. కోటలోకి ప్రవేశించిన మాకు ఎదురుగా శ్మశానం దర్శనమిచ్చింది. చూపులకు అతి పురాతనమైనదిగా ఆ శ్మశానం కనిపించింది. మా ముఖాల్లో అనుమానపు నీడలను తొలగించటానికి అన్నట్లుగా... "ఈ శ్మశానం బ్రిటీషువారి కాలంనాటిద"ని ముకేష్ తెలిపారు.

ఒక వేళ మీరు చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? ఇక్కడ క్లిక్ చేయండి
Shruti AgarwalWD
మెట్లమీంచి జారితే మృత్యువు ఒడిలోకే...
అక్కడ కాసేపు విశ్రమించిన తర్వాత, మేము మా ప్రయాణాన్ని కొనసాగించాము. పలు భాగాలుగా విభజించిన ఒక పురాతన కొలను మా దృష్టిలో పడింది. గైడ్ మాకు వివరణ ఇస్తూ శివాలయంలోకి ప్రవేశించే ముందు అశ్వద్ధామ ఈ కొలనులో స్నానమాచరిస్తాడనీ, అయితే కొందరు ప్రజల విశ్వాసాన్ని అనుసరించి 'ఊటవలి నది'లో స్నానమాచరించిన తర్వాతనే అశ్వద్ధామ దేవాలయంలోకి ప్రవేశిస్తాడని వెల్లడించారు. వర్షపు నీటితో నిండిన కొలనులోని నీరు నిశ్చల స్థితిలో ఆకుపచ్చ వర్ణాన్ని కలిగి ఉండటాన్ని చూశాం. బుర్హాన్పూర్లో మండు వేసవిలో సైతం కొలను ఎండిపోదని తెలుసుకొని మేము సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాం.
Shruti AgarwalWD


ఫోటో గ్యాలరీ కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
ఆ గగుర్పొడిచే ప్రాంతాలను దాటి మరికాస్త ముందుకు వెళ్లాక... ఇనుముతో చేసిన రెండు కోణాలు మాకంట పడ్డాయి. దానిని "ఫానిసిఘర్"(నేరస్థులను ఉరితీసేందుకు వినియోగించే స్థలం) అని అంటారని గైడ్ మాకు వివరించారు. ఇక్కడ ఉరి తీయబడ్డవారిని చనిపోయిన అనంతరం కూడా ఉరికంభానికి వారు వేలాడదీస్తారు. కొంత కాలం గడిచాక నేరస్థుని అస్తిపంజరాన్ని కోటలోని కందకంలో పారవేస్తారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే మేము అక్కడ నుంచి నిష్క్రమించాము. కొంత దూరం వెళ్లాక చుట్టూ కందకాలతో ఆవరించి ఉన్న గుప్తేశ్వర్ మహదేవ్ ఆలయాన్ని చేరుకున్నాము.

'ఖాండవ వనం' (ఖాండవ జిల్లా) ద్వారా దేవాలయానికి చేరుకునే రహస్య మార్గం కందకాలలో దాగి ఉన్నదని అప్పుడే తెలుసుకున్నాము. కందకాల మధ్యలోని వృత్తాకార మెట్ల ద్వారా దేవాలయంలోకి ప్రవేశించాము. మెట్లను ఉపయోగించడంలో చిన్న పొరపాటు జరిగినా మృత్యుదేవత ఒడిలోకి చేరుకున్నట్లే.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? ఇక్కడ క్లిక్ చేయండి.
Shruti AgarwalWD
తొలి ఝాము దాటి రెండు గంటల సమయంలో...
దేవాలయంలోకి వెళ్లగానే దేవతామూర్తికి నిత్యం ధూప దీప నైవేద్యాలు జరుగుతున్న సంగతిని గ్రహించాము. శివలింగంపై కొబ్బరి ముక్కలను కుంకమ కనబడ్డాయి. దేవాలయంలో ఒక రాత్రంతా గడపాలని నిర్ణయానికి వచ్చాము. అర్ధరాత్రి కాగానే, ఇక్కడ ఉండడం మంచిది కాదు త్వరగా బయలుదేరండి అంటూ ముకేష్ మమ్మల్ని తొందరపెట్టారు. అయితే మేము దేవాలయంలోనే ఉండాలని బలవంత పెట్టటంతో అతడు మాతో పాటుగా కోటలో ఉండక తప్పలేదు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అర్థరాత్రి దాటి... తొలి ఝాము కాగానే రెండు గంటల సమయంలో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత హఠాత్తుగా పడిపోయింది. గతంలో నేను చదివిన పేరు గుర్తులేని పుస్తకంలోని ఒక వాక్యం నాకు కాకతాళీయంగా గుర్తుకు వచ్చింది. " ఎక్కడ ఆత్మలు తిరుగాడుతుంటాయో, అక్కడ ఉష్ణోగ్రత పడిపోతుంది ". మా బృందంలోని కొందరు భయపడిపోవడం ప్రారంభించారు.
Shruti AgarwalWD


అక్కడ పరిస్థితి భయానకంగా మారింది. సూర్యకిరణాలు పుడమిని తాకుతున్న సమయాన, ఉదయం నాలుగు గంటల వరకు మేము దేవాలయంలోనే గడిపాము. కొలనును చేరుకుంటూ ఉండగా... కొలనును పరిశీలించాల్సిందిగా హరున్ మాకు సూచించారు. కొలను వైపుకు అడుగులు వేసాం. అయితే అనుమానించాల్సిన అంశాలేవీ మాకు కనిపించలేదు. అయితే మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ దేవాలయంలోని శివలింగంపై గులాబీ పుష్పం అగుపించింది. అక్కడ పుష్పాన్ని ఎవరు ఉంచారో మాకు అర్థం కాలేదు. ఆ పని ఎవరైనా తుంటరి చేసారా లేక అశ్వద్ధామనా?

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? ఇక్కడ క్లిక్ చేయండి.


ఈ కల్పితానికి ఆరంభం:
ఈ కల్పితం పూర్వరంగాన్ని బుర్హాన్పూర్లోని సేవాసదన్ మహావిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ షఫీ మాకు వివరించారు. బుర్హాన్పూర్ చరిత్ర మహాభారత కాలంతో ముడిపడి ఉన్నదని ఆయన తెలిపారు. గతంలో ఈ స్థలం ఖాండవ వనంలో ఒక భాగమని షఫీ అన్నారు. గొర్రెల కాపరి 'ఆహేర్' పేరును కోట పేరుగా పెట్టడం జరిగింది. ఫారూఖీ పరంపరకు చెందిన చక్రవర్తులు 1380లో ఈ కోటను నిర్మించారు. ఇక అశ్వద్ధామ విషయానికి వస్తే. ఆ నమ్మకాలను చిన్నతనంలో తమ పూర్వీకుల నుంచి విన్నట్లు ఆయన తెలిపారు. ఇదంతా వ్యక్తిగత నమ్మకాలకు సంబంధించినది. అయితే అంతు తెలియని లెక్కకు దొరకని సొరంగాలు కోటలో ఉన్నాయన్నది వాస్తవం.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? ఇక్కడ క్లిక్ చేయండి.