శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By PNR

ఏరులై పారుతున్న నెయ్యి

WD PhotoWD
నదిలా ప్రవహిస్తున్న నెయ్యిని మీరెప్పుడైన చూసారా? మీ సమాధానం లేదనే వస్తుంది. శ్రీరాముని రాజ్యంలో పాలు, నెయ్యి నది ఉండేవని మన పెద్దలు అంటుండేవారు. కానీ ఆ కాలంలో వలె ఇప్పటి ఆధునిక కాలంలో సైతం అటువంటి నదిని గుజరాత్‌లోని రూపాల్ గ్రామంలో మేము కనుగొన్నాము. ఈ వారం ఏదినిజం విభాగంలో రూపాల్ గ్రామంలో 6 లక్షల కిలోల నెయ్యిని భక్తులు ఉత్సవమూర్తికి సమర్పించే వైనాన్ని పరిచయం చేస్తున్నాం.

మీరు నమ్మినా నమ్మకపోయినా నెయ్యి సమర్పణ కార్యక్రమానికి రూ. 10 కోట్లు ఖర్చు అవుతుందనేది కాదనలేని వాస్తవం. ప్రతిసంవత్సరం నవరాత్రి ఉత్సవాల తొమ్మిదవ రోజున మాతా అధ్యశక్తి వరదాయిని ఊరేగింపును రూపాల్ గ్రామ ప్రజలు భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు. ఊరేగింపులో భక్తులు వేలసంఖ్యలో పాల్గొని
WD PhotoWD
అమ్మవారికి నెయ్యిని నివేదిస్తుంటారు. అలా చేయడం వలన అమ్మవారు తమ కోరికలను తీరుస్తుందని అక్కడి ప్రజల విశ్వాసం.

సాధారణంగా బట్టలపై నేతి మరకలను శుభ్రం చేయడం శ్రమతో కూడుకున్న పని, కానీ ఊరేగింపు సమయంలో నెయ్యిలో ముంచినట్లుగా మారిన తమ బట్టలపై పేరుకుపోయిన నెయ్యి చాలా సులువుగా తొలగిపోతుందని వారు చెపుతుంటారు. వారి మాటల్లో సత్యమెంతో తెలుసుకునేందుకు మేము రూపాల్ గ్రామానికి వెళ్ళాం.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ గ్రామంలో పల్లి మహోత్సవం పేరిట నవరాత్రి తొమ్మిదవరోజు అధ్యశక్తి వరదాయిని అమ్మవారి రథోత్సవం జరుగుతుంటుంది. మేము అక్కడకు చేరుకోగానే భారీ స్థాయిలో భక్త జనసందోహం మాకు కనిపించింది. గ్రామపెద్ద చెప్పినదానిని అనుసరించి 10 లక్షల మంది భక్తులు రూపాల్ గ్రామానికి విచ్చేసారు. 'ఖేఛ్రా' (ఊరేగింపు సందర్భంగా తయారు చేసే సాంప్రదాయ వంటకం) తయారీలో తలెత్తిన జాప్యంతో అర్థరాత్రి 12.00 గంటలకు ప్రారంభం కావలసిన ఊరేగింపు తెల్లవారుఝూము 03:30 గంటలకు బయలుదేరింది.
WD PhotoWD
ఊరేగింపు సందర్భంగా గ్రామంలోని 27 వీధులలో ట్రక్కుల నిండా నెయ్యిని నింపి ఉంచారు. రథానికి బక్కెట్ల కొద్ది నెయ్యిని భక్తులు నివేదించడం ప్రారంభించారు. గత సంవత్సరం అమ్మవారికి నైవేద్యంగా 4.5 లక్షల కిలోల నెయ్యిని భక్తులు సమర్పించగా, ఈ సంవత్సరం అది 6 లక్షల కిలోలకు పెరిగిందని వరదాయిని దేవస్థానం ధర్మకర్త నితిన్ భాయ్ పటేల్ తెలిపారు.

అమ్మవారికి సమర్పించిన నెయ్యిని చిన్నపిల్లల దేహానికి మర్దన చేసినట్లయితే, పిల్లలు సంతోషంగా ఉంటారని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆ కారణంగా దుష్టశక్తుల నుంచి తమ పిల్లలను దూరంగా ఉంచేందుకు అనేకమంది భక్తులు తమ సంతానంతో సహా ఈ ఊరేగింపునకు హాజరువుతుంటారు. వరదాయిని మాత ఆశీస్సుల కోసం కొత్తగా పెళ్ళయిన యువతులు తమ భర్తలతో సహా ఊరేగింపులో పాల్గొంటారు.

ఈ ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి నెయ్యిని సమర్పించడం ద్వారా సంతానం లేని దంపతులు సంతానాన్ని పొందవచ్చునని గ్రామస్థులు
WD PhotoWD
నమ్మబలుకుతుంటారు. భారీ పరిమాణంలో సాగే నెయ్యి సమర్పణతో రూపాల్ గ్రామంలోని వీధులన్నీ నదులుగా రూపాంతరం చెందుతుంటాయి. వాల్మీకి వర్గానికి చెందిన ప్రజలు వీధులను శుభ్రం చేసేందుకై ఊరేగింపుకు ప్రత్యేకంగా వస్తారు. ఊరేగింపు ముగిసిన అనంతరం వీధులలోని నెయ్యిని సేకరించి, శుభ్రపరిచిన వాల్మీకి వర్గీయులు దానిని బజారులో విక్రయిస్తారు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

WD PhotoWD
కొందరు ప్రజలు ఈ సంప్రదాయం పట్ల అత్యంత భక్తి విశ్వాసాలను ప్రదర్శిస్తుండగా, మరికొందరు ఇదొక మూఢనమ్మకంగా కొట్టిపారేస్తున్నారు. ఊరేగింపు కోసం నెయ్యిని వృధాగా నేలపాలు చేసే బదులు పేదప్రజలకు వినియోగించినట్లయితే వారి ఆశీస్సులను పొందిన వారమవుతామని ఈ సంప్రదాయాన్ని వ్యతిరేకించే 'పల్లి పరివర్తన్ అభియాన్' వ్యవస్థాపకులు లోకేష్ చక్రవర్తి అన్నారు.

మరో మార్గంగా ఈ నెయ్యిని తక్కువ ధరకు విక్రయించడ ద్వారా వచ్చిన లాభాలను రూపాల్ గ్రామంలోని ఆసుపత్రులు, పాఠశాలలు, గ్రంథాలయాలు తదితరాలకు ఖర్చు చేయడం సర్వులకు శ్రేయస్కరమని లోకేష్ సూచించారు. కానీ లోకేష్ సూచనలను వ్యతిరేకించే గ్రామస్థులు ఆయనను 'లంకాధీశుడైన రావణాసురుని'గా విమర్శిస్తుంటారు.

కానీ లోకేష్ చక్రవర్తి సూచనలతో మేము సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాము. గౌతమ బుద్ధుని ప్రవచనాలను అనుసరించి సమాజానికి ఉపకరించే ప్రజ
WD PhotoWD
మనోభావాలను ఈ దేశంలోని మతవిశ్వాసాలు అణచి వేస్తున్నాయి. " మన పురాణేతిహాసాలలో ప్రస్తావించిన ప్రతి అంశం కూడా వాస్తవమని ప్రజలు విశ్వసిస్తుంటారు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కానీ ఏదైనా కార్యాన్ని తలపెట్టినప్పుడు, దాని గురించి ఆలోచించిన తర్వాతనే పనిని మొదలుపెట్టాలని నేను భావిస్తున్నాను." తథాగతుని బోధనలను ఆచరణలో పెట్టవలసిందిగా మా ప్రియమైన పాఠకులను అభ్యర్థిస్తున్నాము. నమ్మకానికి, మూఢనమ్మకానికి మధ్య సన్నని గీత మాత్రమే ఉంటుంది. కనుక గౌతమ బుద్ధుని బోధనలలోని పరమార్థాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాం.
WD PhotoWD
సంప్రదాయం వెనుక దాగిన పురాణ గా

పురాణ గాథలను అనుసరించి ద్వాపర యుగంలో ద్రౌపదితో కలిసి పాండవులు అరణ్యవాసం చేసేందుకు ఈ గ్రామం నుంచి వెళుతూ తమ కార్యం అవిఘ్నంగా సాగాలని వరదాయిని దేవిని ప్రార్థిస్తారు. ఎటువంటి అరణ్య మరియు అజ్ఞాతవాసాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న పాండవులు ఈ గ్రామ వీథులలో అమ్మవారిని బంగారు రథంలో ఊరేగించి నెయ్యిని సమర్పించుకుంటారు.

అలా ప్రారంభమైన ఈ సంప్రదాయాన్ని గ్రామస్థులు ప్రతి సంవత్సరం పాటిస్తున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారి ఊరేగింపు కోసం ఒక మేకును కూడా వాడకుండా సరికొత్త రథాన్ని సిద్ధం చేస్తారు. క్షురకులు రథాన్ని అలంకరించగా, కుమ్మరి కులస్థులు మట్టితో చేసిన ఐదు కుండలను రథంపై ఉంచుతారు. తోటమాలులు రథాన్ని
WD PhotoWD
పుష్పాలతో అలంకరిస్తారు.

ఊరేగింపునకు ముందు జ్యోతిష్కులు ఆ సంవత్సరపు వర్షపాతాన్ని అంచనా వేస్తారు. ఈ సంవత్సరపు పంటలకు సరిపడే రీతిలో వర్షాలు విస్తారంగా కురుస్తాయని శైలేష్ భాయి బంధాడి (జ్యోతిష్కులు) అంచనా వేసారు. పోయిన సంవత్సరం ఆయన జ్యోతిష్యం నిజమైంది.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.