ఒక్క ఫోను కాల్‌తో పాము కాటుకు విరుగుడు
ఫోను కాల్ తో పాముకాటుకు విరుగుడు సాధ్యమా? ఈ దశలో ఫోను కాల్‌తో పాము కాటు బారిన పడిన బాధితునికి స్వస్థత చేకూర్చే వ్యక్తిని గురించి మీకు తెలియచేయబోతున్నాము. ఆశ్చర్యపడకండి... ఇది నిజంగా జరిగిన సంఘటన. మేము దీని సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు సిద్దంగా ఉన్నాము. మేము మా ప్రయాణాన్ని ఇండోర్‌లోని రాంబాగ్ కాలనీ (మధ్యప్రదేశ్) నుంచి ప్రారంభించాము.ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండిఅక్కడకు చేరుకున్న తరువాత, పాము కాటుకు విరుగుడు చూపే ఆ వ్యక్తిని అన్వేషించసాగాము. ఆ ప్రాంతంలోని ప్రాంతీయ రక్షకభట నిలయంలో ఆ వ్యక్తిని కనుగొనడం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు, మేము కలుసుకున్న వ్యక్తి రక్షక భట నిలయంలో గత 25 సంవత్సరాలుగా పోలీసు కానిస్టేబుల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
అతనే యశ్వంత్ సింగ్ ఫోను ద్వారా పాము కాటు బాధితులకు ఉపశమనం కలిగిస్తున్న వైనాన్ని మాకు తెలియజేసిన వ్యక్తి. పాము కాటు విరుగుడులో కొన్ని సంస్కృత మంత్రాలను తాను కనుగొన్నట్లు అతను మాతో అన్నాడు. అతను మాట్లాడుతూ ఉండగా, అతని టేబుల్‌పై గల ఫోను మ్రోగడం ప్రారంభించింది. అతడు ఏ విధంగా ఫోను ద్వారా పాము కాటుకు ఉపశమనం కలిగిస్తున్నది మా కనులారా చూసాము.చర్చలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి
అతడు మాతో మాట్లాడుతూ “ ప్రక్రియ ప్రారంభంలో రోగి తల్లి పేరు, రోగి చిరునామాను అడుగుతాను. తరువాత సంస్కృత మంత్రాలను రహస్యంగా చదవడం ప్రారంభిస్తాను. రోగికి ఉపశమనం కలుగుతుండగనే, కొబ్బరి కాయను ముక్కలుగా పగులగొట్టిన తరువాత కొంత ఉప్పును రుచి చూడమని చెబుతాను. రోగి ఉప్పు తాలూకూ ఉప్పదనాన్ని గుర్తించగనే, రోగి ఆరోగ్యవంతుడైనట్లు నిర్దారించవచ్చును.”ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండిసర్మాన్ గోయల్ పేరు గల రోగి మాతో మాట్లాడుతూ “ ఒకరోజు, నేను ఇంటిని శుభ్రం చేస్తుండగా, నా రెండు కాళ్ళపై పాము కాటు వేసింది. నేను భగవత్‌గారు ఉన్న ప్రాంతానికి చేరుకోగానే నా బాధ నిమిషాలలో నయమైపోయింది. నేను వారికి సదా కృతజ్ఞడునై ఉంటాను.” సర్మాన్ గారి వలే భగవత్ సహాయంతో పాము కాటు ప్రమాదం నుంచి బయటపడిన వారు అనేక మంది ఉన్నారు. తన రోగుల వివరాలతో కూడిన మూడు పుస్తకాలను ఆయన నిర్వహిస్తున్నారు.