శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

జీవితాన్ని మార్చిన కల....

WD
కలలు ఊహలు మాత్రమేనని, వాస్తవ జీవితానికి కలలకు ఏ సంబంధమూ లేదని సాధారణంగా చెబుతుంటారు. అయితే... ఒకే ఒక్క స్వప్నం ఒకానొక వ్యక్తి మొత్తం జీవితాన్నే మార్చివేయగలద మీరు నమ్మగలరా.. నమ్మలేరు కదూ.. అయితే చూడండి మరి.. ఇటువంటి అద్భుతం జరిగిన మధ్యప్రదేశ్‌లోని మనాసా అనే పేరుగల కుగ్రామానికి ఏది నిజం సీరీస్‌లో భాగంగా ఈ వారం మిమ్ములను తీసుకుపోతున్నాం..

మనాసా గ్రామానికి చెందిన బబిత పుట్టుకతోనే వైపరీత్యాలతో జన్మించడమే కాకుండా తన చేతులను, కాళ్లను కూడా ఆమె కదిలించలేదు. ఇతర పిల్లలతో పోలిస్తే ఆమె శరీరంలోని ఇతర భాగాలు కూడా పనిచేయకుండా ఉండేవి. తనకు తానుగా నిలబడడం, నడవడం చేయలేని బబిత జీవితమంతా పడుకునే ఉండాల్సి వచ్చింది.
WD


యుక్తవయసు వచ్చేనాటికి ఆమె ఒకరోజు కల కనింది. ఆ కలలో ఆమెకు రాజస్థాన్‌లో పేరొందిన మహర్షి బాబా రామ్‌దేవ్‌జీ కనిపించారు. లేచి నిలబడు.. సహాయం అవసరమున్న ప్రజలకు సేవచేయి అని ఆయన ఆమెను ఆజ్ఞాపించారు. అంతే.. ఉన్నట్లుండి ఆమెకు కాళ్లు కొద్దిగా కదిలినట్లనిపించింది. ఆపై ఆమె జీవితం మరో దారి పట్టింది. ఇప్పుడు ఆమె తన రోజువారీ పనిని తానే చేసుకోవడమే కాకుండా వ్యాధిగ్రస్తులైన ప్రజలకు సేవ చేస్తోంది కూడా..
WD
విజయ్ అనే వ్యక్తి తన సమస్య పరిష్కారానికి బబిత దగ్గరకు వచ్చాడు. చాలాకాలంగా తనకు చెయ్యి నొప్పి పెడుతూ వస్తోంది. బబిత ఉదంతం గురించి వినగానే అతడు ఆమె నివాసప్రాంతానికి వచ్చేశాడు. ఆమె చేసిన చికిత్స ద్వారా కోలుకున్నాడు. తన చేయికి మసాజ్ కోసం రోజూ ఆమెను కలుస్తుంటాడు.

మరొక రోగి మనాసా గ్రామంలోనే నివసిస్తుంటాడు. పేరు సంతోష్ ప్రజాపత్. ఇతడికి ఎప్పటినుంచో వెన్ను నొప్పి ఉంటోంది. వీపు నొప్పి నివారణకు బబిత దగ్గరకు వచ్చిన సంతోష్ ఆమె మసాజ్ తీసుకుని తన నొప్పిని తగ్గించుకున్నాడు. బబిత మర్దన కోసం సమీప ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూంటారు.

బబిత మొదట్లో తను కూర్చున్న చోటి నుంచి కూడా కదిలేది కాదని మనాసా పల్లెకు చెందిన ఒక మహిళ చెప్పింది. అయితే ఒకరోజు బాబా రామ్‌దేవ్‌జీ ఆమెకు కలలో కనిపించాడని, అప్పటినుంచి ఆమె లేచి నడుస్తోందని ఆ మహిళ చెప్పింది. పాత్రలు కడగటం, గోధుమ శుభ్రపర్చడం, తుడవడం వంటి పనులన్ని తన కాళ్లను ఉపయోగించి ప్రస్తుతం బబిత చేసుకుంటోందని ఆమె చెప్పింది. ఇది నిజంగా అద్భుతం. ఈ కల తర్వాత, గ్రామీణ ప్రజలు ఆమెను సందర్శిస్తూ తమ సమస్యలను పరిష్కరించుకుంటున్నారు.

కలలు మన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ప్రోత్సహిస్తాయని అందరూ అంటుంటారు. కానీ బబిత ఉదంతం వీటిలో చాలా ప్రత్యేకమైంది. మరి మీరేమనుకుంటున్నారు... ఇది కేవలం మూఢనమ్మకమేనా లేదా భక్తికి సంబంధించిన అద్భుత ఉదాహరణగా భావించవచ్చా.. అయితే నిజం అనేది మీ ముందే బబిత రూపంలో ఉంది. మీరు దానిని విస్మరించలేరు. నిజంగా దీనిని నమ్మలేరు కదూ.. మీ అభిప్రాయాలు గురించి తెలుసుకోవడానికి దయచేసి మాకు రాయండి.