శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By WD

దత్తజయంతినాడు దెయ్యాల జాతర

WD
భారతదేశపు ఆత్మ గ్రామాలలో కనపడుతుంది. జాతరలకు మారుపేరు గ్రామాలు. దాదాపు అన్ని జాతర్లలోనూ ప్రజలు వస్తువులను కొనడం, వినోదకార్యక్రమాలలో పాల్గొనడం సర్వసాధారణంగా జరిగేదే. కాని కొన్ని జాతరలు అలా కాకుండా వైవిధ్యమైన పోకడలతో ప్రజలను ఇట్టే ఆకట్టుకుంటాయి.

ఈ వారం 'ఏది నిజం'లో వినోదంతో పాటు దెయ్యాలను చూపించే వింతైన జాతరకు మిమ్మల్ని తీసుకువెళ్తున్నాం... నమ్మశక్యంగా లేదు కదూ...! కానీ ఇది నిజం. అటువంటి జాతరను మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో గల చోరవడ్ గ్రామంలో జరుగుతుంది. ఈ జాతరను దెయ్యాల జాతరగా పిలుచుకుంటారు.

ప్రతి ఏటా దత్త జయంతి నాడు ఈ గ్రామంలో దెయ్యాల జాతరను నిర్వహిస్తుంటారు. దత్తజయంతినాడు దెయ్యం పట్టిన వాళ్లు ఇక్కడకు వచ్చినట్లయితే, వారిని పట్టుకున్న దెయ్యం పారిపోతుందని గ్రామీణ ప్రజల విశ్వాసం. ఇదంతా విన్న తరువాత నిజానిజాలు తెలుసుకుందామని చోరవడ్ గ్రామానికి చేరుకున్నాము. గ్రామానికి దారితీసే మార్గంలో ప్రజలు గుంపులు గుంపులుగా కనపడ్డారు. ఆ గుంపుల్లో ఒకరు లేదా ఇద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా కనిపించారు.
WD


జబ్బు పడ్డ వారితో మాట కలపడానికి మేము ప్రయత్నించగా, వారిని దెయ్యం పట్టిందని, దెయ్యాన్ని వదిలించుకోవడానికే తాము జాతరకు తీసుకువచ్చినట్లు వారితో కూడా ఉన్నవారు మాతో అన్నారు.
WD
మిగిలిన జాతరలకు తీసిపోని రీతిలో ఫలహార శాలల, వినోదాన్ని కలిగించే ప్రాంగణాలతో, భారీ జన సందోహాన్ని ఈ జాతర కూడా సంతరించుకుంది. కానీ మాకు ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో కొందరు తమను తాము గాయపరుచుకుంటూ కనిపించారు. మానసిక ప్రకోపానికి గురైనా వారిలా అరుస్తున్నారు. కొందరైతే తమలో తాము మాట్లాడుకుంటున్నారు.

ఈ విపరీత ప్రవర్తన సమయం గడిచే కొద్దీ పెరుగుతూనే ఉంది. వైవిధ్యమైన పద్ధతిలో వాళ్లు కేకలు వేస్తున్నారు. కొద్ది సేపు వేచి ఉన్న అనంతరం సమతలంగా ఉన్న వేదికకు అభిముఖంగా తలలు వంచి వాళ్ళు ప్రార్థనలు చేస్తుండటాన్ని గమనించాము. ఈ సంఘటన అనంతరం వాళ్ళు సాధారణ వ్యక్తుల వలె వ్యవహరించడం మొదలుపెట్టారు.

తమ వాళ్ళకు పట్టిన దెయ్యం పీడ విరగడ అయ్యిందని వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు విశ్వసించసాగారు. దెయ్యం పట్టినట్లుగా వ్యవహరిస్తున్న అనేకమంది వ్యక్తులను జాతరలో చూసిన మాకు నోట మాట రాలేదు. బాధితుల్లో అత్యధికులు మహిళలు కావడాన్ని మేము ముఖ్యంగా గుర్తించాము. కొందరి అభిప్రాయాలను, ఆలోచనలు తెలుసుకున్న అనంతరం జాతరకు వచ్చే బాధితులు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా మాకు గోచరించింది.
WD


వారికి మానసిక చికిత్సతో పాటుగా బోలెడంత సానుభూతి అలాగే ప్రేమతో నిండిన ఆప్యాయతానురాగాలు అవసరం. కానీ మీరు భగవంతుని విశ్వసిస్తున్నట్లయితే, దెయ్యాల ఉనికిని సైతం నమ్మాలని అక్కడి ప్రజలు మాతో అన్నారు. దెయ్యాల జాతరను గురించి మీరేమి అనుకుంటున్నారో మాకు రాయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల కోసం ఎదురుచూస్తుంటాము.