గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By K.Ayyanathan

నాడీ జ్యోతిష్యం : తాళపత్రాలలో భవిష్యత్

WD PhotoWD
మన దేశంలో జ్యోతిష్యం వటవృక్షం నీడలో హస్తసాముద్రికం, సంఖ్యాశాస్త్రం, నక్షత్ర భవిష్యవాణి ఇలా అనేక రకాల పద్ధతులు వేళ్ళూనుకుని ఉన్నాయి. ఈ పద్దతులలో శతాబ్దాల కాలంగా అత్యంత ప్రాచుర్యం పొందినదిగా నాడీ జ్యోతిష్యం పేర్కొనబడింది. ఏదినిజం శీర్షికలో భాగంగా, ఈ వారం ఆశ్చర్యానికి గురి చేసే జ్యోతిష్యాన్ని మీకు పరిచయం చేసేందుకు తమిళనాడులోని పవిత్ర పుణ్యక్షేత్రమైన వైదీశ్వరన్ దేవాలయానికి తీసుకు వెళ్తున్నాం.

ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

వైదీశ్వరన్ దేవాలయానికి చుట్టుపక్కల మీ భవిష్యత్తును, మీ తలరాతను తెలియజెప్పే నాడీజ్యోతిష్యానికి చెందిన పలు ప్రకటన బోర్డులు మీకు అడుగడుగునా కనిపిస్తూ మీకు స్వాగతం చెపుతుంటాయి. వలం తమిళనాడు నుంచేకాక దేశంలోని పలు ప్రాంతాల నుంచి, ఖండాంతరాల నుంచి వచ్చే ప్రజలు వైదీశ్వరుని దర్శనం చేసుకుంటారు. అంతేకాక నాడీజ్యోతిష్యం ద్వారా తమ భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు

మా పరిశోధనలో భాగంగా కె.వి.బాబూరావు అనే నాడీ జ్యోతిష్కుని మేము కలుసుకున్నాము. ఆయన మాకు నాడీ జ్యోతిష్యాన్ని గురించి వివరించారు. 2000 సంవత్సరాల క్రితం జీవించిన అగస్త్య మహర్షి నాడీ జ్యోతిష్యానికి నాంది పలికారు. అనంతరం కౌశిక మహర్షి, శివ వాగ్గేయకారులు నాడీ జ్యోతిష్యానికి కొనసాగించారు.
WD PhotoWD


నాడీ జ్యోతిష్యం చెప్పేందుకు పురుషులకు కుడి చేతి బొటనవేలి ముద్రను, స్త్రీలకు ఎడమ చేతి బొటనవేలి ముద్రను ప్రామాణికంగా తీసుకుంటారు. వేలి ముద్ర ఆధారంగా వివరాలతో వారి పేరు, జీవితభాగస్వామి పేరు, తండ్రి, తల్లి, సోదరీమణులు, సోదరుల పేర్లు మరియు సంఖ్యలు, వారి ఆస్థి, విద్యార్హతలు మరియు అనేక విషయాలను తాళపత్రాలు తెలియజేస్తాయి. పై విషయాలు ఖచ్చితంగా తెలియజేయబడ్డాయనే నిర్థారణకు వచ్చిన అనంతరం భవిష్యత్తులో దేనికి సంబంధించిన వివరాలను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ అంశం కోసం శోధన ప్రారంభమవుతుంది.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.

WD PhotoWD
మానవులకు సంబంధించి 108 వేలిముద్రలు ఉంటాయని బాబుస్వామి మాతో అన్నారు. వీటిలో చిన్న మార్పులను అనుసరించి ఉపవర్గాలు కూడా ఉంటాయి. ఒక వ్యక్తికి చెందిన తాళపత్రాన్ని కనుగొనేందుకు వేలిముద్ర కీలకమైంది. వేలిముద్రలు ఒకరినుంచి మరొకరికి భిన్నంగా ఉంటాయి. ముద్ర ఆకారాన్ని అనుసరించి వాటిని వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. బొటనవేలి ముద్ర ద్వారా ప్రశ్నలను అడిగేందుకు ఖచ్చితమైన తాళపత్రాల దొంతరను ఎంచుకొంటారు.

ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

జ్యోతిష్యం ఎలా చెపుతారని మేం అడిగాం. మాలోని ఒకరు బొటనవేలి ముద్రను ఇచ్చారు. ముద్రను చూడగానే ఇది శంఖం ఆకారంలో బాబూస్వామి తెలిపారు. వెంటనే తాళపత్ర గ్రంధాలు భద్రపరిచిన గదిలోకి ఆయన వెళ్ళారు. కొద్ది నిమిషాల అనంతరం తాళపత్రాల దొంతరతో బాబూస్వామి మా దగ్గరకు వచ్చారు. వేలి ముద్ర ఇచ్చిన వ్యక్తిని అవును లేదా కాదు అనే సమాధానం చెప్పవలసిందిగా బాబూస్వామి సూచించారు.

తొలి ప్రశ్నకు వేలిముద్ర వ్యక్తి కాదు అని సమాధానమిచ్చాడు... ఆయన రెండవ తాళపత్రాన్ని తీసుకుని మరో ప్రశ్న అడిగారు. మళ్ళీ కాదు అనే సమాధానం వచ్చింది. అలా పది తాళపత్రాలకు అదే సమాధానం వచ్చింది. మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ పదకొండవ తాళపత్రం నుంచి వచ్చిన ప్రశ్నలు అవుననే సమాధానాలు రాబట్టాయి.
WD PhotoWD


"మీరు రెండు డిగ్రీలను కలిగి ఉన్నారా?" అని బాబూస్వామి ప్రశ్నించగా అవుననే సమాధానం వచ్చింది.
మీరు స్వంత ఇంటిలో నివసిస్తున్నారా? అవును.
మీకు ఏవైనా వ్యాధులున్నాయా? లేవు.
మీ భార్య ఉద్యోగం చేయడం లేదు కదా? అవును.
మీరు ఒకసారి, మీ నాన్నగారు ఒకసారి మాత్రమే పెళ్ళి చేసుకున్నారు కదా? అవును.
మరో రెండు ప్రశ్నలకు సైతం సమాధానం అవుననే వచ్చింది.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.

WD PhotoWD
కానీ ఎనిమిదవ ప్రశ్నగా మీ కుమార్తె విదేశాలలో చదువుతున్నది కదా అన్న ప్రశ్నకు కాదు అనే సమాధానం వచ్చింది. బాబూస్వామి సంబంధిత తాళపత్రాన్ని పక్కన పెట్టారు. మరో తొమ్మిది తాళపత్రాల నుంచి ఆయన ప్రశ్నలు అడిగారు. కానీ అన్నింటికీ కాదు అనే సమాధానం వచ్చింది.

మరో దొంతరను తీసుకు వచ్చేందుకు ఆయన మరోసారి వెళ్ళిన ఆయన ఖాళీ చేతులతో తిరిగివచ్చారు. "ఈ రోజు మీకు అచ్చిరాలేదు, భవిష్యత్తును గురించి తెలుసుకోవాలని కోరుకునే వారికే మాత్రమే సరియైన తాళపత్రం లభిస్తుంది. ఇది కూడా తలరాతపై ఆధారపడి ఉంటుందని" బాబూస్వామి మాతో అన్నారు. ఇప్పటివరకు చెప్పిన జాతకానికి ఎంత ఇవ్వమంటారని అడుగగా ఏమి వద్దని ఆయన సమాధానమిచ్చారు.

ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

" ఎవరివైనా పూర్తి వివరాలు చెప్పిన తర్వాతనే డబ్బులు తీసుకోవాలనేది ఇక్కడి నియమం" అని బాబూస్వామి వెల్లడించారు. మాకు ఆశ్చర్యం కలిగింది. భూమిపై కోట్ల సంఖ్యలో మానవులు పుడుతుంటారు. వారందరి తలరాతలు, జీవితాలు మన రుషులు రూపొందించిన ఈ తాళ పత్రాలలో దాగి ఉన్నాయి.
WD PhotoWD


సంప్రదాయమేదైనా, విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా తలరాత, పునర్జన్మ, గతస్మృతులు అనేవి శాస్త్రీయమైన మెదడుకు అందని చిక్కు ప్రశ్నలు. కానీ తమ స్వీయ అనుభవాలతో సంతృప్తి చెందిన సాధారణ ప్రజలు... వీటిని అంగీకరిస్తున్నారు. మీరు అంగీకరిస్తున్నారా? మాకు రాయండి.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.