శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

ఫోన్‌లో భక్తి.. సెల్‌లో వినాయక ముక్తి

WD PhotoWD
దేవుడు సైతం మొబైల్ ఉపయోగిస్తున్నాడంటే మీరు నమ్మగలరా.. ఆశ్చర్యమేస్తుంది కదూ.. మీరు ఈ విషయాన్ని నమ్మకపోతే 1200 సంవత్సరాల నాటి ఆలయానికి మిమ్ములను తీసుకెళతాం. ఇక్కడే వినాయకుడు మొబైల్‌ ఫోన్‌తో తన భక్తులను సంప్రదిస్తుంటాడు.

ఈ కాలంలో ప్రజలు ఎక్కడ చూసినా ఒత్తిళ్ల మధ్యనే బతుకుతున్నారు. కనీసం గుడికి వెళ్లేందుకు కూడా వీరికి తీరిక దొరకడం లేదు. అయితే ఇకనుంచి జనం భయపడవలసింది లేదు. ఎందుకంటే ఇండోర్‌లో జునా చింతామన్ గణేష్ భక్తుల వేడుకోళ్లను మొబైల్ ఫోన్‌లో విని వారి కోరికలు తీరుస్తుంటాడు.

జునా చింతామన్ గణేశ ఆలయానికి 1200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయ పూజారి చెప్పినదాని ప్రకారం, గత 22 ఏళ్లుగా భక్తులు ఈ ఆలయానికి లెక్కలేనన్ని ఉత్తరాలు పంపుతున్నారట. వీటిలో కొన్ని వేడుకోలు రూపంలో ఉంటే మరి కొన్ని కృతజ్ఞతలు తెలిపే ఉత్తరాలు.

అయితే ఇప్పుడు మొబైల్ ఫోన్లు ప్రజల అభిమానం పొందాయి కనుక ఇక్కడి వినాయకుడికి ఉత్తరాలతో పాటు ఫోన్‌కాల్స్ కూడా వస్తున్నాయట. ఎవరైనా భక్తుడు కాల్ చేసినట్లయితే, ఆలయ పూజారి మొబైల్ ఫోన్‌ని వినాయకుడి చెవులకు సమీపంలో ఉంచుతారు. అప్పుడు భక్తులు తమ సమస్యలు, కోరుకునే పరిష్కారాల గురించి దేవుడికి విన్నవించుకుంటారు.

WD PhotoWD
ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ సమస్యలను జునా చింతామణ్ గణేష్ నిజంగా మొబైల్ ఫోన్ ద్వారా వింటున్నాడని విశ్వసిస్తుంటారు. పైగా ఉత్తరాల రూపంలో లేదా ఫోన్ ద్వారా భక్తులు చేసే విన్నపాలను దేవుడు నెరవేరుస్తుంటాడు కూడా. ఇలా తమ కోరికలను నెరవేర్చినందుకు గాను మనీష్ మోడీ ఈ ఆలయంలోని వినాయకుడికి కృతజ్ఞతలు తెలిపాడు కూడా.

ఇక్కడి గణేషునికి భారత్ నుంచే కాకుండా అంతర్జాతీయ కాల్స్ కూడా వస్తుంటాయి. ఒకటి కంటే మించి ఎక్కువ కోరికలున్న భక్తులు వాటిని ఉత్తరాల రూపంలో పంపుతుంటారు. ఇలా ఉత్తరాల ద్వారా, మొబైల్ కాల్స్ ద్వారా వినాయకుడు తమ కోరికలను విని వాటిని నెరవేరుస్తాడని భక్తుల విశ్వాసం.

వినాయకుడు మొబైల్ ఫోన్ మరియు ఉత్తరాల ద్వారా తన భక్తులందరి కోరికలను వింటూ ఉంటాడన్న విషయాన్ని మీరు నమ్ముతారా.. లేదంటే ప్రజలను ఆకట్టుకోవడానికి ఇది ఒక వాహకంలాగా ఉపయోగపడుతోందని భావిస్తున్నారా... ఈ ఉదంతంపై మీరేమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ కథనంపై దయచేసి మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి.