గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By PNR

రంగులు మార్చే శివలింగం...

WD PhotoWD
రామసేతువుకు తలెత్తిన ముప్పుతో శివలింగం రంగు మార్చుకుంటున్నదా? నమ్మండి నమ్మకపోండి, వారణాసిలోని శివలింగాలకు తోడుగా లక్నో నగరంలోని శివలింగాలు కూడా తమ రంగులను మార్చుకుంటున్నాయి. ఒకేరోజులో శివలింగాలు తమ రంగును మార్చుకున్న వైనం, కొన్ని సంవత్సరాల క్రితం తూర్పు భారతంలో విఘ్నేశ్వరుని విగ్రహాలు పాలు తాగిన ఉదంతాన్ని గుర్తుకు తెస్తుంది.

ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

లక్నోలోని ఛారోధామ్ దేవాలయంలో శివలింగం రంగు మార్చుకున్న సంగతి తెలియగానే, దేవాలయానికి చేరుకున్న అనేక మంది భక్తులు శివలింగానికి పూజలు చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు నల్లరంగులోని శివలింగం తెల్లరంగులోకి మారడంతో ఈ సంఘటన బహుళ ప్రాచుర్యానికి నోచుకుంది. ఈ
WD PhotoWD
సంఘటన భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

ఈ అద్భుతాన్ని చూసేందుకు పురప్రముఖులలో ఒకరైన కుందన్‌లాల్ జ్యుయలెర్స్ యజమాని అతుల్ అగర్వాల్‌తో పాటు దేవాలయ గౌరవ ధర్మకర్తలు దేవాలయానికి చేరుకున్నారు. చౌపాటియాలో నెలకొన్న ఛారోధామ్ సిధ్ధపీఠ్ దేవాయలయ పూజారి సియారామ్ అవస్థి ఈ సంఘటనను భగవంతుని లీలగా విశ్వసిస్తున్నారు.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి

WD PhotoWD
పాత లక్నోలోని ఈ ప్రాంతానికి 'చోటా కాంచీ' అనే మరో పేరుంది. ఛారోధామ్ దేవాలయం మరియు 'బడీ కాళీజీ'లు ఈ దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ దేవాలయానికి వచ్చే భక్తులు రామేశ్వరం, బదరీనాధ్, కేదారనాధ్, ద్వారకాదేశ్ మరియు జగన్నాధ్‌లను కూడా సేవించవచ్చు. ఇక్కడ స్వర్గ నరకాలను సైతం మీరు చూడవచ్చు. ఈ దేవతామూర్తిని పురావస్తు శాఖ విభాగం వారు నమోదు చేసుకున్నారని సియారామ్ అవస్థి మాతో అన్నారు.

ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఛారోధామ్‌కు చెందిన ఈ దేవాలయం, రామేశ్వరంలోని రామేశ్వరం దేవాలయాన్ని పోలి ఉంటుంది. దేవాలయంలోని ప్రధాన శివలింగానికి సమీపంలో రామసేతువు నమూనా ఉంది. రావణాసురుని సభను కూడా ఇక్కడ చూడవచ్చు. ఇదిలా ఉండగా మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ రామేశ్వరంలోని నిజదేవాలయంలోని శివలింగం
WD PhotoWD
సైతం తన రంగును మార్చుకుంది.

ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి రామసేతువుపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు మరియు పురావస్తు శాఖ సమర్పించిన నివేదిక కారణంగానే ఈ వింతలు చోటు చేసుకుంటున్నాయని సియారామ్ అవస్థి పేర్కొన్నారు. ఆదివారం నాడు లక్నోలోని రాణీ కుట్రలో గల సంతోషీమాత దేవాలయంలోని శివలింగం రంగును చూసి భక్తులు విస్తుపోయారు.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి

WD PhotoWD
ఈ పురాతన దేవాలయంలోని తెల్లరంగు శివలింగంపై ఎరుపు రంగు పట్టీలు ప్రత్యక్షం కావడం చూసి భక్తులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. చివరకు 'నంది' విగ్రహం కూడా రంగు మార్చుకుంది. మహాశివుని నేత్రాలు (శివలింగం) కూడా ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

దేవాలయ పూజారి చంద్రశేఖర్ తివారీ మాతో మాట్లాడుతూ 20 సంవత్సరాల తన అనుభవంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం ఇదే ప్రధమమని అన్నారు. తన ఉనికిని చాటుకునే క్రమంలో భగవంతుడు మన ఎదుట ఇటువంటి లీలలను ప్రదర్శిస్తుంటాడు. తనను నమ్మనివారికి తన గొప్పదనాన్ని తెలియజెప్పేందుకు భగవంతుడు ఇలా చేస్తాడు. ప్రతిదీ కూడా మన నమ్మకం పైన ఆధారపడి ఉంటుందని తివారీ పేర్కొన్నారు.

ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పుడిక శివలింగం తన యదార్ధ రూపాన్ని సంతరించుకున్నది. శివలింగానికి చేరిన ఎరుపురంగు, నల్ల మచ్చలుగా మారిందని భక్తులు పేర్కొంటున్నారు. మధుబాల, యోగితాసింగ్, వందనా పాండే, బ్రిజేష్ పాండే, అజిత్ కుమార్ శర్మ, మనోజ్ మిశ్రా తదితర రాణీకట్రా చౌక్‌కు చెందిన వారు కూడా ఈ సంఘటనను
WD PhotoWD
భగవంతుని లీలగా విశ్వసిస్తున్నారు.

సంఘటన అనంతరం, అనేకమంది భక్తులు ఈ ప్రాంతాన్ని దర్శించుకున్నారు. ఇదే తరహా సంఘటన సరోజనీ నగర్ పరిధిలోని చార్ బాగ్ మరియు 'గౌరీ గావ్' గ్రామాలలో కూడా చోటు చేసుకుంది. అనేక మంది ప్రజలు దీనిని అద్భుతంగా భావిస్తున్నారు.

పురావస్తు శాఖ అదనపు డైరక్టర్ పి.కె.సింగ్ విశ్వాసాన్ని అనుసరించి ఈ సంఘటన శాస్త్రీయ కారణాల వలన జరిగింది. వేల సంవత్సరాల నాటి విగ్రహాలలో కూడా ఇటువంటి మార్పులు చూడలేదని ఆయన అన్నారు. ఈ సంఘటన పురావస్తు శాఖకు సంబంధించినది కాదని పి.కె.సింగ్ విశ్వసిస్తున్నారు. మా ప్రయత్నంలో భాగంగా ఐ.ఆర్.టీ.సీ. మాజీ డైరక్టర్ డాక్టర్ పి.కె. సేథ్‌ వివరణ కోరాలని అభ్యర్థించగా ఆయన అందుకు నిరాకరించారు.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి