శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

రోగం పట్టి పీడిస్తోందా... నా వద్దకు రండి...

WD
ఈ వారం ఏది నిజం శీర్షికలో పండోఖర్ ధామానికి చెందిన గురుశరణ్ మహరాజ్‌ బాబాను మీకు పరిచయం చేస్తున్నాం. ఎలాంటి శారీరక వైకల్యాన్నైనా నయం చేస్తానని ఆయన నమ్మబలుకుతుంటారు. బుందేల్‌ఖండ్ జిల్లాలోని పండోఖర్ కుగ్రామంలో నివసించే బాబా తరుచుగా పలు ప్రాంతాలను సందర్శిస్తుంటారు.

ఇక ఆయన వైద్య శిబిరం ప్రారంభం కాగానే, వ్యాధిగ్రస్ధుల్లో ఒకరిని తన దగ్గరకు రమ్మని పిలుస్తారు. రోగిని ఏమీ అడక్కుండానే కాగితం ముక్కపై వ్యాధి లక్షణాలను రాస్తారు. ఆ కాగితాన్ని రోగికి చూపించి వ్యాధి గురించి తనకు పూర్తిగా తెలుసుననే నమ్మకాన్ని బాబా కలిగిస్తారు.
WD


అనంతరం గంభీరమైన స్వరంతో నడవలేకపోతున్న రోగిని నడిపించే దిశగా ప్రేరేపిస్తారు. బాబా స్వరం వినిపించిన వెంటనే గబగబా నడిచే ప్రయత్నంలో నాలుగు అడుగులు వేసిన వెంటనే కిందపడిన కొందరు రోగులను మేం ప్రత్యక్షంగా చూసాం. మరేం భయపడాల్సిన అవసరం లేదని, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో వారి వైకల్యం నయమౌతుందని బాబా హామీ ఇస్తుంటారు.

WD
బాబా చెప్తుండగానే రామ్‌భావ్ రాజూరియా అనే వ్యక్తి బాబాకు పూల దండను సమర్పించుకున్నాడు. నడవలేకపోతున్న తాను బాబా దయతో ప్రస్తుతం హాయిగా నడుస్తున్నాని రామ్‌భవ్ మాతో అన్నాడు. రక్షా దారాలను ధరించి అమావాస్య రోజు కనీసం ఐదు సార్లు సందర్శించవలసిందిగా బాబా సూచిస్తుంటారు. అయితే బాబా వ్యవహారాన్ని వైద్యులు పూర్తిగా కొట్టిపారేస్తున్నారు.

అలవిమాలిన ఉత్సాహం కొద్ది రోగులు నడిచినప్పటికీ, అలా చేయడంతో వాళ్ల వెన్నెముక దెబ్బ తింటుందని శల్య వైద్య నిపుణుడు జయేషా షా ఆందోళన చెందుతున్నారు. అంతేకాక రోగులు జీవితాంతం నడవలేని స్థితికి చేరుకుంటారని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే మానసికంగా కలిగే ఉత్తేజంతో కొందరు రోగులు తమ అంగవైకల్యాన్ని అధిగమించవచ్చునని చెప్పిన జయేష్ షా, వెయ్యి మంది రోగుల్లో కేవలం ఒక్కరికి మాత్రమే ఇది అరుదుగా సంభవిస్తుందని అంటున్నారు. ఇంతకీ మీరేమంటారు? దయచేసి మాకు రాయండి...