శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By JSK
Last Modified: మంగళవారం, 25 అక్టోబరు 2016 (20:41 IST)

గాజులతో కనకదుర్గ అమ్మవారికి అలంకరణ...

బెజవాడ ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మంగళ వారం రోజున కనకదుర్గ అమ్మవారిని అత్యంత ప్రసన్నమూర్తిగా గాజులతో అలంకరించారు. అమ్మవారి మూలవిరాట్టుతో పాటు అంతరాలయాన్ని సైతం గాజులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ఉత్సవం కోసం భక్తుల నుంచి 4 లక్షలకు

బెజవాడ ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మంగళ వారం రోజున కనకదుర్గ అమ్మవారిని అత్యంత ప్రసన్నమూర్తిగా గాజులతో అలంకరించారు. అమ్మవారి మూలవిరాట్టుతో పాటు అంతరాలయాన్ని సైతం గాజులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ఉత్సవం కోసం భక్తుల నుంచి 4 లక్షలకు పైగా గాజులు వచ్చాయి. మరో లక్ష గాజులు ఆలయ అధికారులు కొనుగోలు చేసి అలంకరణకు ఉపయోగించారు. ప్రధాన ఆలయంతో పాటు మహా మండపంలోని ఉత్సవ మూర్తికి ఈ గాజులతో అలంకారం చేసారు. 
 
ఎక్కువ గాజులను ఇక్కడే ఉపయోగించారు. గాజులోత్సవం వేడుకను చూడాలంటే ఉత్సవమూర్తిని దర్శించుకోవాల్సిందే. దుర్గమ్మను ఇలా అలంకరించి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం ఇక్కడ భక్తుల్లో ఆనందాన్ని నింపుతోంది. తొలిసారిగా  అమ్మవారికి గాజులతో ప్రత్యేకంగా అలంకరించటం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 
అమ్మవారిని దసరా వేడుకల్లోనే కాకుండా ఇలాంటి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించటం ఆలయ వైభవాన్ని మరింతగా పెంచటమేనని చెబుతున్నారు. గాజుల అలంకారంలో అమ్మవారిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.