శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 11 జులై 2017 (18:07 IST)

ఇక నుంచి శ్రీవారి భక్తులకు ఆధార్ తప్పనిసరి

తిరుమలలో బ్రేక్‌ దర్శనాలకు దరఖాస్తు చేసుకునే భక్తులు జూలై 11వ తేదీ నుంచి తప్పనిసరిగా ఆధార్‌ కార్డు జిరాక్స్‌ను జత చేయాలని టిటిడి చెబుతోంది. గతంలో ఏ గుర్తింపు కార్డును తీసుకొచ్చినా స్వీకరించిన టిటిడి ఇక నుంచి అలా చేయకూడదన్న నిర్ణయానికి వచ్చేసింది. కేం

తిరుమలలో బ్రేక్‌ దర్శనాలకు దరఖాస్తు చేసుకునే భక్తులు జూలై 11వ తేదీ నుంచి తప్పనిసరిగా ఆధార్‌ కార్డు జిరాక్స్‌ను జత చేయాలని టిటిడి చెబుతోంది. గతంలో ఏ గుర్తింపు కార్డును తీసుకొచ్చినా స్వీకరించిన టిటిడి ఇక నుంచి అలా చేయకూడదన్న నిర్ణయానికి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆధార్‌కు ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తుండటంతో ఆ కార్డును ఖచ్చితంగా తీసుకొచ్చి పేర్లను స్పష్టంగా నమోదు చేసుకోవాలని టిటిడి ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
 
బ్రేక్‌ దర్శనాల జారీలో మరింత పారదర్శకత పెంచేందుకు టిటిడి ఈ మేరకు చర్యలు చేపట్టింది. బ్రేక్‌ దర్శనానికి వచ్చే సమయంలో భక్తులు ఆధార్‌ను వెంట తీసుకురావాలని కోరింది. కాగా ప్రస్తుతం బ్రేక్ దర్శనానికి దరఖాస్తు చేసే వ్యక్తి ఆధార్ సమర్పించాలని, వారితో పాటు వచ్చే మిగిలిన భక్తులకు కూడా త్వరలో ఆధార్‌ను తప్పనిసరి చేస్తామని టిటిడి తెలియజేసింది.
 
అదేవిధంగా, తిరుమలలో శ్రీవారి దర్శనం, బస, లడ్డూ ప్రసాదం తదితర సేవల్లో మరింత పారదర్శకత పెంచేందుకు, భద్రతాపరమైన ఇబ్బందులు రాకుండా చూసేందుకు భక్తులు ఆధార్‌ను వినియోగించి సహకరించాలని టిటిడి కోరుతోంది.