గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : ఆదివారం, 15 మే 2016 (12:41 IST)

తిరుమల శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉభయ రాష్ట్రాల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బోస్లే శనివారం ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో స్వామి సేవలో కుటుంబ సమేతంగా ఆయన పాల్గొన్నారు. 
 
ఆలయంలోని రంగనాయకమండపంతో తితిదే అధికారులు సీజే కుటుంబానికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా స్వామి సేవలో పాల్గొన్నారు. 
 
మరోవైపు.. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని తితిదే నిర్వహించింది. 
 
మే 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనుండంతో తితిదే శుద్ధి కోసం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజాన్ని నిర్వహించింది. ఆలయాన్ని తితిదే సిబ్బంది శుద్ధి చేశారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని తితిదే నిర్వహిస్తూ వస్తోంది.