గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 28 మే 2016 (15:28 IST)

'మనిషికీ - జబ్బులకీ' అనుసంధానం అగర్‌ బత్తీ పొగ

అగర్ బత్తీలు. ఆధ్యాత్మికపరంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగివున్నాయి. సువాసనలు వెదజల్లే అగర్ బత్తీల్లో ప్రాణాంతక వ్యాధులు కలిగించే అనేక రసాయనాలు వినియోగిస్తున్నారు. వీటి తయారీలో ఉపయోగించి పాలీఆరోమేటిక్ హైడ్రో కార్బన్‌ల కారణంగా ఈ వ్యాధులు వస్తున్నట్టు నిపుణులు చెపుతున్నారు. 
 
ముఖ్యంగా అగర్ బత్తీని వెలిగించడం వల్ల రసాయన పదార్థం నుంచి కార్బన్ డై ఆక్సైడ్‌, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, కార్బన్ మోనాక్సైడ్‌లు వంటి హానికారక వాయువులు పొగ రూపంలో విడుదలవుతుంటాయి. ఈ పొగను పీల్చడం వల్ల జలుబు, దగ్గు, ఎలర్జీ, తుమ్ములు, ఆస్తమా వంటి సాధారణ అనారోగ్య సమస్యలతో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు చెపుతున్నారు. 
 
అంతేకాకుండా, ఈ రసాయనాల వల్ల చర్మం, కళ్లు తీవ్రమైన ఎలర్జీలకు లోనవుతాయి. తరచుగా ఈ పొగ పీల్చడం వలన ప్రాణాంతకమైన గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలే వృత్తిగా జీవించే వారికి, నిత్యం ఇటువంటి కార్యకలాపాల్లో మునిగి తేలే వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. అందువల్ల గృహాల్లో పూజా సమయంలో కొద్దిసేపు మాత్రం వీటిని వెలిగించి.. పిల్లలను దూరంగా ఉంచడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.