శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Modified: బుధవారం, 14 డిశెంబరు 2016 (18:19 IST)

అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్దే శ్రీవారు...

ఇదేంటిది.. స్వామివారు ఏడుకొండపైన కదా ఉండేది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఏమిటి అనుకుంటున్నారా.. నిజమే.. తితిదే ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయంతో స్వామివారు అన్నిచోట్లా భక్తులకు దర్శనమిస్తున్నారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులు ప్రస్తుతం అలిప

ఇదేంటిది.. స్వామివారు ఏడుకొండపైన కదా ఉండేది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఏమిటి అనుకుంటున్నారా.. నిజమే.. తితిదే ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయంతో స్వామివారు అన్నిచోట్లా భక్తులకు దర్శనమిస్తున్నారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులు ప్రస్తుతం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నిలబడి ఉన్నారు. కారణం సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద స్కానర్స్ మొరాయించడం. 
 
పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత టిటిడికి సరిగ్గా సరిపోతుంది. కోట్ల రూపాయల రాబడి వచ్చే తిరుమల లాంటి ధార్మిక క్షేత్రంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో టిటిడి పూర్తిగా విఫలమవుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో కష్టపడి తిరుపతికి వచ్చే భక్తులను మరింత కష్టపెడుతోంది టిటిడి. అలిపిరిలోని సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద స్కానర్స్ పనిచేయపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే విధంగా తనిఖీ కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు.  
 
ప్రపంచ నలుమూలల నుంచి వాహనాల ద్వారా తిరుపతికి వచ్చే భక్తులను తనిఖీ చేసేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి సప్తగిరి తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ తనిఖీ కేంద్రంలోని పరికరాలు అప్పుడప్పుడూ మొరాయిస్తున్నాయి. పేరుకే కోట్ల రూపాయలు వెచ్చించి కొన్నారు గానీ పనితీరు మాత్రం అంతంత మాత్రమే. ఆరు స్కానర్స్ ను టిటిడి గతంలో కొనుగోలు చేసింది. భక్తులు తీసుకొచ్చే లగేజ్‌తో పాటు భక్తులను అతి సులువుగా ఈ స్కానర్స్ స్కాన్‌ చేస్తాయి. భక్తులలో ఎలాంటి నిషేధిత వస్తువులున్నా వెంటనే గుర్తిస్తాయి. 
 
భద్రతా సిబ్బందికి పనిని తగ్గించడంతో పాటు, భక్తులు త్వరగా తిరుమలకు చేరుకోవాలన్న ఉద్దేశంతో గతంలో టిటిడి పాలకమండలి మాజీ ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్‌ రెడ్డి సప్తగిరి తనిఖీ కేంద్రానికి శ్రీకారం చుట్టి నిర్మించారు. అయితే తనిఖీ కేంద్రాలలో స్కానర్స్ పనితీరు సరిగ్గా ఉందో లేదో నెలకోసారైనా పరిశీలించాలి. అలాంటిది టిటిడి నిర్లక్ష్యంగా వహిస్తుండటంతో భక్తుల పరిస్థితి మరింత హీనంగా మారింది.
 
వివిధ ప్రాంతాల నుంచి గంటల తరబడి తమ వాహనాల్లో వచ్చే భక్తులు సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద కూడా గంటలకు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉన్న ఆరు స్కానర్స్‌లో మూడు మాత్రమే పనిచేస్తుండటంతో భక్తులు నరక యాతనను అనుభవిస్తున్నారు. కోట్ల రూపాయల ఆదాయం వచ్చే టిటిడి ఇప్పటికైనా స్కానర్స్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్థ చూపాలని కోరుతున్నారు భక్తులు.