గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 జులై 2015 (18:17 IST)

అమర్ నాథ్ యాత్రపై ఉగ్రకన్ను: సీరియస్ వార్నింగిచ్చిన ఐబీ వర్గాలు

అమర్ నాథ్ యాత్ర బుధవారం ప్రారంభమైంది. ఈ దఫా ఈ యాత్ర 59 రోజులు సాగనుంది. పవిత్ర హిమాలయాల్లో స్వయంభువుగా అవతరించే మంచు రూప శివలింగాన్ని దర్శించుకోవడం ద్వారా ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ నేపథ్యంలో అమర్ నాథ్ యాత్రపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు, ఇందుకు పక్కా ప్లాన్ రూపొందించారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. యాత్రికుల భద్రత దిశగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిఘా పెంచాలని, పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని సూచించాయి. 
 
దాదాపు 10-15 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించారని.. తొలుత వీరు టెలికాం టవర్లను ధ్వంసం చేసి, సమాచార వ్యవస్థలు నాశనం చేశాక దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ అధికారులు హెచ్చరించారు. కేంద్ర హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ స్వయంగా యాత్రకు బయలుదేరడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు సైన్యం, ఇటు జమ్మూ పోలీసులు భద్రతను పెంచారు.