Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తిరుపతిలో అపూర్వ ఘట్టం - వకుళామాత ఆలయానికి భూమి పూజ

ఆదివారం, 5 మార్చి 2017 (12:51 IST)

Widgets Magazine
vakulamata temple

450 సంవత్సరాల పోరాటం. అన్యాయంపై న్యాయం విజయం. హిందూ ధార్మిక సంఘాలు ఐక్యమై ఎట్టకేలకు వకుళామాత ఆలయానికి భూమి పూజ చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో వకుళామాత ఆలయ నిర్మాణం చేసుకోమని తీర్పు వచ్చిన తర్వాత హిందూ ధార్మికవేత్తలు పండుగ చేసుకున్నారు. 
 
తిరుపతి రూరల్‌లోని వకుళామాత ఆలయానికి భూమి పూజ పూర్తయ్యింది. 450 సంవత్సరాల పోరాటం తరువాత ఎట్టకేలకు ఆలయ నిర్మాణానికి శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి శ్రీకారం చుట్టారు. దేశం నలుమూలల నుంచి 9 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు భూమి పూజలకు హాజరయ్యారు. అలాగే దేవదాయశాఖామంత్రి మాణిక్యాలరావు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
సాక్షాత్తు తిరుమల వెంకన్న తల్లి వకుళామాత అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరగడం ఎంతో సంతోషంగా ఉందని దేవదాయశాఖామంత్రి మాణిక్యాలరావు అన్నారు. త్వరితగతిన ఆలయ నిర్మాణం పూర్తవుతుందని పరిపూర్ణానందస్వామి ధీమా వ్యక్తం చేశారు. వకుళామాత ఆలయ నిర్మాణానికి ఎంత ఖర్చయినా భరించడానికి టిటిడి సిద్ధంగా ఉందన్నారు తితిదే ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. ఈ వేడుకతో పేరూరులో ఒక పండుగ వాతావరణం కనిపించింది.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ప్రపంచం ప్రళయమొచ్చి కొట్టుకుపోయినా ఒక్క ప్రాంతం మాత్రం అలానే ఉంటుంది?

ప్రపంచంలో ప్రళయం వస్తే ఏదీ మిగలదు అని చెబుతారు. కాని ఒక ప్రదేశం మాత్రం దాన్ని సైతం ...

news

శ్రీవారి హుండీలో చెల్లని నోట్లు వెయ్యొంద్దండి ప్లీజ్... భక్తులను కోరిన తితిదే ఈఓ

ఎట్టకేలకు పాత పెద్దనోట్లపై తితిదే కార్యనిర్వహణాధికారి సాంబశివరావు స్పందించారు. ఇప్పటికే ...

news

అలాంటి యువతే కావాలి... స్వామి వివేకానంద సందేశం

స్వామి వివేకానంద భవిష్యత్తు తరాలకు మార్గదర్శి. ఆయన సందేశాలు సూటిగా హృదయాన్ని తాకుతాయి. ...

news

ఏ పురాణంలో ఏముందో..? తెలుసా...?

మనం అనేక సందర్భాల్లో ‘అష్టాదశ పురాణాలు’ అని వింటూ ఉంటాం. అయితే ఆ 18 పురాణాల పేర్లూ ...

Widgets Magazine