శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (14:28 IST)

యాదగిరిగుట్ట అభివృద్ధికి టి. సర్కారు చర్యలు.. సుందరంగా..?

యాదగిరిగుట్ట అభివృద్ధికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టనుంది. యాదగిరి దాని చుట్టూ ఉన్న చెరువులను కూడా అభివృద్ధి చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా గుట్ట చుట్టూ గల నాలుగు చెరువుల్ని సుందరంగా తీర్చిదిద్దాలని తెలంగాణ సర్కారు డిసైడ్ అయ్యింది. ఇందుకోసం ప్రభుత్వం నుంచి రూ.16.59 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 
 
యాదాద్రి అభివృద్ధిపై అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఏయూనడీ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాలన్, ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ యాదగిరిగుట్ట అభివృద్ధి అథారిటీ ప్రత్యేక అధికారి కిషన్ రావు, నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ హాజరయ్యారు. గుట్ట అభివృద్ధిపై తీసుకోవాల్సిన చర్యలపై వారితో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, సేవలు, భక్తుల సౌకర్యాలతో పాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.