గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 జనవరి 2015 (16:24 IST)

దానం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలేంటి?

సంపదను పొదుపుగా ఖర్చుచేయడం మంచిదే కానీ, ఆ సంపదలో కొంత దానధర్మాలకు ఉపయోగించడం వలన అది మరింత పెరుగుతుందని పండితులు అంటున్నారు.
 
ఎవరికివారు తమ సుఖసంతోషాల కోసం ధనాన్ని ఖర్చుచేయడం వలన ఎలాంటి పుణ్యం వచ్చి వారి ఖాతాలో చేరదు. 
 
కష్టాలలో, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వలన, అది భగవంతుడికి ప్రీతిపాత్రుడిని చేస్తుందని చెప్పబడుతోంది. కొంతమంది మహాభక్తుల జీవితాలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంటాయి. దానధర్మాలే భగవంతుడి ప్రీతికి పాత్రులను చేస్తాయి. అలాంటివారికి దారిద్ర్యం దరిచేరుతుందనే భయముండదు. 
 
దానం చేసిన వెంటనే అది పుణ్యంగా మారిపోతుందని, అవసరమైన సందర్భంలో అది అనేకరెట్లు అధికమవుతుంది. దానం చేసే దయామయులు దారిద్ర్యం బారిన పడకుండా.. పరమేశ్వరుడి అనుగ్రహం పొందుతారని పండితులు అంటున్నారు.