శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 3 జూన్ 2017 (16:16 IST)

కాణిపాక ప్రసాదంలో మేకు... ప్రశ్నించినందుకు ఏమన్నారా తెలుసా..?!

కాణిపాక వరసిద్ధి వినాయకుడు. స్వయంభువుగా వెలసిన దేవుడు. కాణిపాకం గురించి తెలియని భక్తులుండరంటే అతిశయోక్తి లేదు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయమంటే భక్తులకు ఎంతో భక్తి. ప్రతి రోజు 20 వేల మందికిపైగా భక్తులు కాణిపాకం ఆలయానికి వస్తుంటారు. తమిళనాడుకి దగ్గరగా

కాణిపాక వరసిద్ధి వినాయకుడు. స్వయంభువుగా వెలసిన దేవుడు. కాణిపాకం గురించి తెలియని భక్తులుండరంటే అతిశయోక్తి లేదు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయమంటే భక్తులకు ఎంతో భక్తి. ప్రతి రోజు 20 వేల మందికిపైగా భక్తులు కాణిపాకం ఆలయానికి వస్తుంటారు. తమిళనాడుకి దగ్గరగా ఉండటంతో తమిళభక్తులే ఎక్కువ మంది కాణిపాకంకు వస్తుంటారు. కాణిపాకం ఆలయం ఎంత ప్రాముఖ్యతో ప్రసాదం అంతే ప్రాముఖ్యత. అయితే అలాంటి కాణిపాక ఆలయ లడ్డూలో మేకు (చీల) కనిపించింది. ఒక భక్తబృందం లడ్డు తింటుండగా మేకు కనిపించడంతో ఏం చేయాలో తెలియక భక్తులు అలాగే చేతుల్లో పట్టుకు నిలబడిపోయారు. 
 
భక్తులు వెంటనే తేరుకుని కాణిపాక వరసిద్ధి దేవస్థానం దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళారు. అయితే దేవస్థానం అధికారులు భక్తులకు సానుకూలంగా సమాధానం చెప్పాల్సింది పోయి భక్తులపైనే తిరగబడ్డారు. మీకు ఇష్టమొచ్చిన చోట చెప్పుకోండి పోండంటూ భక్తులనే తిరగబడ్డారు. దేవస్థానం కార్యాలయం నుంచి బయటకు వెళ్ళిపోండంటూ హుకూం జారీ చేశారు. దీంతో భక్తులు మీడియా ముందు జరిగిన విషయాన్ని తెలిపారు. భక్తులు ఎంతో భక్తిభావంతో స్వీకరించే లడ్డూలోనే ఇంత పెద్ద మేకు వచ్చిదంటే ఆలయ సిబ్బంది పనితీరు ఏ మాత్రమో అర్థమవుతోంది.