Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎంత రద్దీ ఉన్నా గంటలోపే తిరుమల శ్రీవారి దర్శనం...!

బుధవారం, 8 మార్చి 2017 (14:15 IST)

Widgets Magazine
lord venkateswara

తిరుమల.. ఎప్పుడూ రద్దీ ఉండే ప్రాంతం. శని, ఆదివారాల్లో అయితే ఇక చెప్పనవసరం లేదు. ప్రతిరోజు 50 వేల మంది భక్తులు ఉంటే శని, ఆదివారాల్లో ఆ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే రద్దీ పెరిగే కొద్దీ గంటల తరబడి వేచి ఉంటున్న పరిస్థితి. చిన్న పిల్లలు, వృద్ధులైతే కంపార్టుమెంట్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి వాటికి స్వస్తి పలికేందుకు టిటిడి కార్యనిర్వహణాధికారి ఒక నిర్ణయం తీసుకున్నారు.
 
కంపార్టుమెంట్ల నుంచి శ్రీవారి సన్నిధికి భక్తులు గంట వ్యవధిలోనే చేరుకునే విధంగా ఆదేశాలిచ్చారు. వైకుంఠం-1 కారిడార్ మీదుగా భక్తులు ఆలయానికి చేరుకుంటారు. కారిడార్‌లో రెండు స్థంబాల కంటే ఎక్కువ మంది నిలబడకుండా కొలబద్ధత పాటించాలి. ఈ మేరకు కొలమానం పాటించే పక్షంలో కంపార్టుమెంట్ నుంచి బయలుదేరిన యాత్రికులు గంటలోపే స్వామివారి సన్నిధికి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. 
 
తద్వారా నిరీక్షణ.. అలసట లేకుండా తిరుమలేశుని దివ్యమంగళ రూపాన్నీ వీక్షించే భాగ్యం కలుగనుంది. ప్రస్తుతం పలు కంపార్టుమెంట్లలోకి వేలాదిమంది భక్తులను ఒకేసారి కారిడార్‌లోకి వదులుతున్నారు. వీరంతా కనీసం అంటే మూడు నుంచి నాలుగు గంటల పాటు నెమ్మదిగా కదులుతూ క్యూలైన్లలో ఇబ్బంది పడాల్సి వస్తోంది. క్యూలైను వేగం మందగిస్తుంది. దీనిపై భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఈఓ చర్యలు తీసుకున్నారు. ఈఓ ఆదేశించిన విధంగా చేస్తే ఖచ్చితంగా గంటలోనే శ్రీవారి దర్శనం భక్తులకు లభిస్తుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

తిరుమల వెంకన్నకు బంగారు వెండి కానుకలే.. కానుకలు..!

శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తిరుమల, ...

news

భద్రాద్రిలో అపచారం జరిగింది.. గర్భగుడిలోకి ప్రవేశించారట.. కొబ్బరికాయ కూడా కొట్టారట..

పుణ్యక్షేత్రం భద్రాద్రి సీతారాముల వారి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం 5.30 ...

news

ధనప్రాప్తికి శ్రీలక్ష్మి స్తోత్రమ్... దారిద్ర్యం నుంచి విముక్తి...

సువర్ణవృద్ధిం కురుమేగృహే శ్రీః కళ్యాణవృద్ధిం కురుమేగృహే శ్రీః విభూతి వృద్ధిం ...

news

వెంకన్న హుండీలో పాతనోట్లు.. తీసుకునేది లేదన్న ఆర్బీఐ.. తలపట్టుకున్న టీటీడీ

తిరుమల వెంకన్న స్వామి హుండీలో పడిన భారీ పాత నోట్లను మార్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ...

Widgets Magazine