బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 17 మే 2016 (15:53 IST)

కల్పవృక్షవాహనంపై ఊరేగిన గోవిందరాజస్వామి

తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లు కల్పవృక్ష వాహనంపై వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు ఠీవీగా కదులుతుండగా భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. 
 
కల్పవృక్ష వాహన ప్రాశస్త్యాన్ని పరికిస్తే... ప్రకృతికి శోభను సమకూర్చేదే చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. ఇతర వృక్షాలు తమకు కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాకుండా కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. సముద్ర మథనంలో సంకల్ప వృక్షంగా ఆవిర్భవించిన దేవతావృక్షం కల్పవృక్షం. భక్తుల కోరికలు తీర్చే కోనేటిరాయుడు ఈ కల్పవృక్షాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించడమే ఈ వాహన్ ప్రత్యేకతగా చెప్పుకుంటారు.