గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Modified: మంగళవారం, 24 మే 2016 (19:42 IST)

మే 25 నుంచి కళ్యాణ వేంకటేశ్వరస్వామి వసంతోత్సవాలు

చిత్తూరుజిల్లా శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు మే 25 నుంచి 27వ తేదీ వరకు ఘనంగా తితిదే నిర్వహించనుంది. ప్రతిరోజు ఉదయం 8.30గంటలకు ఉత్సవర్లు ఆలయం నుంచి వసంత మండపానికి వేంచేపు చేస్తారు. తొలి రెండురోజులు అంటే మే 25,

చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు మే 25 నుంచి 27వ తేదీ వరకు ఘనంగా తితిదే నిర్వహించనుంది. ప్రతిరోజు ఉదయం 8.30గంటలకు ఉత్సవర్లు ఆలయం నుంచి వసంత మండపానికి వేంచేపు చేస్తారు. తొలి రెండురోజులు అంటే మే 25,27తేదీల్లో శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు.
 
చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి, సీతాలక్ష్మణ హనుమాన్‌ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ క్రిష్ణస్వామి వార్ల ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి వేదపండితులు ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవం అంతరార్థం.
 
రెండోరోజు మే 26వతేదీ సాయంత్రం 6 నుంచి 7గంటల వరకు స్వర్థ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. ప్రతిరోజు మద్యాహ్నం 2 నుంచి 4గంటల వరకు స్నపన తిరుమంజనం సాయంత్రం 6 నుంచి 7గంటల వరకు వూంజల్‌ సేవ, 7 నుంచి 8గంటటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు. 
 
జూన్‌ 15 నుంచి అప్పలాయగుంట వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
 
తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్‌ 15 నుంచి 23వతేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. జూన్‌ 14వతేదీన సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
 
15వతేదీ కర్కట లగ్నంలో ధ్వజారోహణం, 16వతేదీ చిన్నశేషవాహనం, 17వతేదీ ఉదయం సింహవాహనం, సాయంత్రం ముత్యపుపందిరివాహనం, 18వతేదీ ఉదయం కల్పవక్షవాహనం, సాయంత్రం సర్వభూపాల వాహనం, 19వతేదీ ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం గరుడవాహనం, 20వతేదీ ఉదయం హనుమంతవాహనం, సాయంత్రం గజవాహనం, 21వతేదీ ఉదయం హనుమంతవాహనం, సాయంత్రం చంద్రప్రభవాహనం, 22వతేదీ ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వవాహనం, ఏడవతేదీ ఉదయం చక్రస్నానంను తితిదే నిర్వహించనుంది.
 
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుంచి 9గంటల వరకు రాత్రి 8గంటల నుంచి 9గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్‌ 18వతేదీ సాయంత్రం 5గంటల నుంచి 7.30 గంటల వరకు స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు ఉత్తరీయం, ప్రసాదాలు, రవికె, లడ్డు, అన్నప్రసాదం, అప్పంలను తితిదే అందజేయనుంది.