శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (14:43 IST)

అమావాస్య రోజు కోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకం

తితిదేకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో మే 6వ తేదీ శుక్రవారం అమావాస్య రోజు సహస్ర కలశాభిషేకం, సమంత వాహసేవలు నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణ తీసుకుంది. వైఖానవ ఆగమం ప్రకారం, వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, క్రిష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలకు చాలా విశిష్టత ఉంటుంది. 
 
మే 6వ తేదీ అమావాస్య ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల నడుమ సహస్ర కలశాభిషేకం సేవ వైభవంగా నిర్వహించనున్నారు. సేవలో పాల్గొనే దంపతులకు గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేయనున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల నడుమ హనుమంతవాహన సేవలు జరుగనుంది. హనుమంతుడిని సంకట మోచనగా పిలుస్తారు. దుష్టశక్తులను నశింపజేసే చెడు ఆలోచనలను దూరం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి.