గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 జనవరి 2017 (10:47 IST)

తితిదే ఆధ్వర్యంలో కన్యాకుమారి, ఢిల్లీల్లో శ్రీవారి ఆలయం.. రూ.55కోట్లతో నిర్మాణం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కన్యాకుమారి, ఢిల్లీ సమీపంలో (హర్యానా రాష్ట్ర పరిధి) రూ.55 కోట్లతో వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మిస్తున్నట్టు టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. భక్తుల సొమ

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కన్యాకుమారి, ఢిల్లీ సమీపంలో (హర్యానా రాష్ట్ర పరిధి) రూ.55 కోట్లతో వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మిస్తున్నట్టు టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. భక్తుల సొమ్మును వారు కోరిన విధంగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్తకోటి రోజురోజుకీ పెరుగుతోందని వెల్లడించారు. దీనికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలకు అనుగుణంగా సామాన్య భక్తుల దర్శనానికే ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. 
 
ఇదిలా ఉంటే.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు సతీసమేతంగా దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. కేంద్రమంత్రికి తితిదే జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు.అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో సినీనటుడు నాని దంపతులు ఉన్నారు.