శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : గురువారం, 5 మే 2016 (18:26 IST)

19 నుంచి జమ్మలమడుగు శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించడానికి తితిదే సిద్ధమవుతోంది. మే 18వ తేదీన అంకుకార్పణలో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 19వ తేదీన ధ్వజారోహణం, 20వ తేది చిన్నశేష వాహనం, 21వ తేది సింహ వాహనం, 22వ తేది కల్పవృక్ష వాహనం, 23వ తేది పల్లకీ సేవ, 24వ తేది హనుమంత వాహనం, 25వ తేది రథోత్సవం, 26వ తేది సూర్యప్రభ వాహనం, 27వ తేది చక్రస్నానాన్ని నిర్వహించనున్నారు. 
 
ఉత్సవాల్లో భాగంగా మే 24వ తేది సాయంత్రం కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు ఒక లడ్డూ, ఒక అప్పం, ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా తితిదే ఉచితంగా అందించనుంది. అలాగే అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. మే 28వ తేదీన పుష్పయాగం నిర్వహిస్తారు. 
 
ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు భక్తి సంగీత కార్యక్రమ, హరికథాగానం, కోలాటాలు నిర్వహించనున్నారు.