Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేటి నుంచే కాలినడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల రద్దు

గురువారం, 6 జులై 2017 (14:07 IST)

Widgets Magazine
tirumala

వారాంతపు రోజుల్లో దివ్యదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాల్లో వచ్చే యాత్రికులకు ఇకపై శుక్ర, శని, ఆదివారాల్లో దివ్యదర్శన టోకెన్ల జారీని నిలిపివేయనున్నారు. జులై 7వ తేదీ నుంచి దీన్ని అమలు చేయనున్నారు. గత కొన్నిరోజులుగా కాలినడకన తిరుమలకు వచ్చే వారి సంఖ్య పెరగడంతో భక్తులు గంటల తరబడి దర్శనం కోసం క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తోంది. దర్శనం ఆలస్యం కావడంతో కొన్నిసార్లు యాత్రికులు ఆందోళనలు కూడా చేస్తున్నారు. దీంతో వారాంతాల్లో దివ్యదర్శన టోకెన్ల జారీని నిలిపివేయాలని తితిదే నిర్ణయించింది.
 
నేటి అర్థరాత్రి నుంచి రేపు అర్థరాత్రి వరకు దివ్యదర్శన టోకెన్లను తితిదే నిలిపివేయనుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, కాలినడకన వెళ్లే భక్తులకు దర్శనం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు తితిదే అధికారులు. అయితే తితిదే నిర్ణయంపై మాత్రం కాలినడక భక్తులు మండిపడుతున్నారు. ఉన్నట్లుండి తితిదే ఈ నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయంగా వేరే దర్శనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ఆషాఢంలో కొత్తజంటను ఎందుకు వేరుచేస్తారో తెలుసా?

ఆషాఢ మాసానికి ఎంతో ప్రత్యేక ఉంది. వర్షాకాలానికి ఆరంభం చుట్టేది ఈ మాసమే. వ్యవసాయ పనులు ...

news

తిరుమల శ్రీవారికి భుజకీర్తులు - విలువెంతో తెలుసా...!

కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకన్నకు కానుకలకు కొదవేలేదు. ఇది ఇప్పటి కాదు. ఎప్పటి నుంచో ఉంది. ...

news

ఇలా చేస్తే మీకు దరిద్రంపోయి ధనవంతులవుతారట...!

ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి. కాబట్టి మనం ధనవంతులం కావాలంటే ఆమెకు ఆగ్రహం వచ్చే ఏ పనులు ...

news

అలాంటి సమయాల్లో పరమేశ్వరుడిని పూజిస్తే...(వీడియో)

నీలకంఠుడు అన్న నామం శంకరునకు గల నామాలలో ప్రసిద్ధమైనదే. శివుడు అంటే కళ్యాణ ...

Widgets Magazine