గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 17 మే 2016 (12:27 IST)

భూలోక వైకుంఠాన్ని తలపించేలా పద్మావతి పరిణయోత్సవం

తిరుమలలో పద్మావతి పరిణయోత్సవం కన్నుల పండువగా కొనసాగుతోంది. రెండa రోజు కూడా నారాయణగిరి ఉద్యానవనంలో ఎంతో వైభవంగా స్వామి, అమ్మవార్ల పరిణయోత్సవాన్ని తితిదే వేదపండితులు నిర్వహించారు. భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో స్వర్ణకాంతులు విరజిమ్ముతున్న స్వర్ణిమ మండపంలో ఉత్సవాలను తితిదే అట్టహాసంగా నిర్వహిస్తోంది. 
 
పరిణయోత్సవల్లో భాగంగా రెండో రోజు పెండ్లి మండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవడం, పూల బంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. పూలబంతులాట్లో తితిదే ఈఓ దంపతులు పాల్గొన్నారు. ఆస్థానాన్ని నిర్వహించారు. 
 
శ్రీవారికి వేదాలు, పురాణాలు, సంగీతరాగాలు, కవితలు, నృత్యాలను నివేదించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు బంగారు పల్లకినెక్కి అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో రెండోరోజు ఉత్సవం ముగిసింది. పరిణయోత్సవంలో పాల్గొన్న భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణను తితిదే అందజేసింది. ఈ పరిణయోత్సవ వేడుకలు బుధవారంతో ముగియనున్నాయి.