శివపూజ చేస్తూ.. కుప్పకూలిపోయిన అర్చకుడు.. ఎక్కడ?

శివపూజ చేస్తూ అర్చకుడు కుప్పకూలిపోయాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, సోమేశ్వర జనార్థన స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమేశ్వర జనార్థనస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడైన కందుకూరి వె

lord shiva
selvi| Last Updated: శుక్రవారం, 15 జూన్ 2018 (15:39 IST)
చేస్తూ అర్చకుడు కుప్పకూలిపోయాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, సోమేశ్వర జనార్థన స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమేశ్వర జనార్థనస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడైన కందుకూరి వెంకటరామారావు స్వామివారికి పూజలు నిర్వహిస్తుండగా.. గుండెపోటుకు గురయ్యాడు. 
 
ఆలయంలోనే కుప్పకూలిన అర్చకుడిని తోటివారు పైకి లేపినా ఫలితం లేకపోయింది. దీంతో శివలింగంపైనే పడిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గుడిలో ఉన్న ఇతర అర్చకులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తలించారు. 
 
అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గర్భగుడిలో చోటు చేసుకున్న ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ నెల 11న ఈ ఘటన జరగినా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.దీనిపై మరింత చదవండి :