Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వెంకన్న హుండీలో పాతనోట్లు.. తీసుకునేది లేదన్న ఆర్బీఐ.. తలపట్టుకున్న టీటీడీ

సోమవారం, 6 మార్చి 2017 (13:03 IST)

Widgets Magazine
hundi

తిరుమల వెంకన్న స్వామి హుండీలో పడిన భారీ పాత నోట్లను మార్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం మల్లగుల్లాలు పడుతోంది. నోట్ల రద్దు కారణంగా వెంకన్న హుండీ ఆదాయం బాగా పడిపోయింది. కానీ శ్రీవారి హుండీలో పాత నోట్లు కట్టలు కట్టలుగా పడినాయి. ఇవన్నీ పాత రూ.500, రూ.1000 నోట్లే. వాటిన్నింటినీ లెక్కగడితే నాలుగు కోట్ల రూపాయలుగా తేలింది. వాటిని ఏం చేయాలో తెలియక టీటీడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇవన్నీ గత రెండు నెలల్లో హుండీలోకి వచ్చినట్టు తెలుస్తోంది. 
 
వాటిని మార్చేందుకు సమయం ముగిసిపోయినా.. వాటిని ఏం చేయాలో తెలియక టీటీడీ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖలు రాశారు. అయితే పాత నోట్లను స్వీకరించేందుకు బ్యాంకులతో పాటు ఆర్‌బీఐ నిరాకరించడంతో టీటీడీ గందరగోళంలో పడింది. పేరుకుపోయిన పాత నోట్లను ఏం చేయాలో తెలియక టీటీడీ తర్జనభర్జన పడుతోంది. 
 
తిరుమల వెంకన్నకు రోజూ రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల దాకా స్వామివారికి ఆదాయం వస్తుంది. గత ఏడాది నవంబర్ 8వ తేదిన కేంద్రం పెద్దనోట్ల రద్దు చేయడంతో.. శ్రీవారి ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అనుకున్నారు. కానీనోట్ల రద్దు తదనంతర పరిణామాల నేపథ్యంలో కానుకలు అటుంచి కొండకు వచ్చే భక్తులు సంఖ్య సగానికి తగ్గింది. దీంతో ఆదాయం తగ్గడంతో టీటీడీ ఆలోచనలో పడింది. పాత నోట్లే రూ.4కోట్లు హుండీల్లో పడిపోయాయి. దీంతో హుండీలో పడిన మొత్తాన్ని మార్చుకునేందుకు ఆర్బీఐతో పాటు కేంద్రానికి కూడా టీటీడీ అధికారులు లేఖ రాశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

తిరుపతిలో అపూర్వ ఘట్టం - వకుళామాత ఆలయానికి భూమి పూజ

450 సంవత్సరాల పోరాటం. అన్యాయంపై న్యాయం విజయం. హిందూ ధార్మిక సంఘాలు ఐక్యమై ఎట్టకేలకు ...

news

ప్రపంచం ప్రళయమొచ్చి కొట్టుకుపోయినా ఒక్క ప్రాంతం మాత్రం అలానే ఉంటుంది?

ప్రపంచంలో ప్రళయం వస్తే ఏదీ మిగలదు అని చెబుతారు. కాని ఒక ప్రదేశం మాత్రం దాన్ని సైతం ...

news

శ్రీవారి హుండీలో చెల్లని నోట్లు వెయ్యొంద్దండి ప్లీజ్... భక్తులను కోరిన తితిదే ఈఓ

ఎట్టకేలకు పాత పెద్దనోట్లపై తితిదే కార్యనిర్వహణాధికారి సాంబశివరావు స్పందించారు. ఇప్పటికే ...

news

అలాంటి యువతే కావాలి... స్వామి వివేకానంద సందేశం

స్వామి వివేకానంద భవిష్యత్తు తరాలకు మార్గదర్శి. ఆయన సందేశాలు సూటిగా హృదయాన్ని తాకుతాయి. ...

Widgets Magazine