తెరుచుకున్న అయ్యప్ప ఆలయం.. భద్రతకట్టుదిట్టం
గురువారం, 16 నవంబరు 2017 (10:53 IST)
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయం తెరుచుకుంది. మండలం - మకరవిలక్కు వార్షిక ఉత్సవాల దృష్ట్యా ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో తొలిరోజు స్వామివారిని దర్శించుకోవడానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. రాబోయే రోజుల్లో మరింతమంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉండటంతో ఆలయ ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
కాగా, తొలిరోజు ఆలయ ప్రధాన అర్చకుడు మహేశ్ మొహన్నరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మలయాళం నెల అయిన విరిశ్చికం తొలిరోజును పురస్కరించుకుని గురువారం స్వామివారి ఆలయంలో అష్టద్రవ్య మహా గణపతి హోమాన్ని నిర్వహించారు. 41 రోజుల పాటు జరిగే మండలం ఉత్సవాలు మండల పూజతో డిసెంబర్ 26న ముగియనున్నాయి.
అదేరోజు ఆలయం తాత్కాలికంగా మూసివేస్తారు. మకరవిలక్కు ఉత్సవాలను పురస్కరించుకని డిసెంబర్ 30న మళ్లీ ఆలయాన్ని తెరుస్తారు. జనవరి 14న మకరవిలుక్కు (జ్యోతిదర్శనం) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అక్కడికి వారం తర్వాత ఉత్సవాలు ముగుస్తాయి. మళ్లీ ఆలయాన్ని మూసివేస్తారు. ఈ రెండు సందర్భాల్లో స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు దాదాపు 4 నుంచి 5 కోట్ల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు.
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :
,
,
,
,