బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 5 జనవరి 2016 (17:03 IST)

తిరుమాడ వీధుల్లో ముగ్గులెందుకు వేస్తారో తెలుసా?

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వర ఆలయం.. తిరుమల మాడవీధుల్లో రంగురంగుల ముగ్గులు అక్కడక్కడా కనిపిస్తాయి. ఎంత అందమైన రంగువల్లులో కదా అనుకుంటాం. ఇంతకీ తిరుమల మాడవీధుల్లో ముగ్గులు ఎందుకు వేస్తారో మీకు తెలుసా? అయితే చదవండి. తిరుమల వీధుల అలంకరణలో ముగ్గులూ  ఒక భాగం అనిపిస్తుంది. అయితే బ్రహ్మోత్సవాలు వంటి కార్యక్రమాల సందర్భంగా వాహనోత్సవాల్లో ఈ ముగ్గులకో ప్రత్యేక స్థానం ఉంటుంది.
 
స్వామి వాహనంపై అధిరోహించిన తర్వాత ఏ వాహనమైన ముగ్గు దగ్గరకు రాగానే ఆగిపోతుంది. హారతులు అందుకుంటుంది. ఇదొక సంకేత స్థలం. భారీ సందోహంతో కదిలే వాహనం ఎక్కడ ఆగాలో ముందుగా నిర్ణయించిన స్థలం. గతంలో తిరుమల ఒక ఊరుగా ఉన్నప్పుడు ప్రజలు వాహనాన్ని ఆపి హారతులు ఇచ్చే ప్రదేశాలనే గుర్తించి ముగ్గులు వేయించారు. వాహనాన్నిమోసే బోయీలు ముగ్గు దగ్గరకు రాగానే ఆగుతారు. అది శ్రీవారి ఆలయంలో ముగ్గుల సంగతి. 
 
ఇకపోతే.. మూడు, నాలుగేళ్లకోసారి తిరుమల ఆలయంలో గర్భకులారాన్ని మారుస్తారు. గర్భగృహకు లారం అంటే గర్భగుడికి కట్టిన పరదా అని అర్ధం. పరదాను కులారం అంటారు. గర్భగుడి వద్ద కడతారు. కాబట్టి గర్భగృహకులాకారంగా వాడుకలో వుంది. ప్రత్యేకించి శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఉగాది ఆస్థానం, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి వంటి ఉత్సవాలకు టీటీడీ కొత్త పరదాలను తెప్పిస్తుంది.