శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 17 మే 2016 (15:45 IST)

18న కేరళలోని కుట్టిపురంలో శ్రీనివాస కళ్యాణం

భగవద్‌ రామానుజుల వారి సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా 106 దివ్యదేశాల పర్యటనలో ఉన్న సంచార రథం మే 18న ఉదయం 6.30 గంటలకు కేరళ రాష్ట్రంలోని నిలంబూరు నుంచి సంచార రథం బయలుదేరి 8.30 గంటలకు పట్టాంబికి చేరుకుంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. అక్కడ సమీపంలోని తిరువితువక్కోడులో గల శ్రీఉయ్యావంత పెరుమాళ్‌ ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 11.30గంటలకు కుట్టిపురానికి రథం చేరుకుని తిరునావాయ్‌లో గల శ్రీ నావాయ్‌ ముగుంద పెరుమాళ్‌ ఆలయాన్ని దర్శిస్తారు. కుట్టిపురంలో సాయంత్రం శ్రీనివాస కళ్యాణం కూడా నిర్వహించనున్నారు. 
 
ఈ సంచార రథంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవమూర్తులు, శ్రీ రామానుజుల వారి విగ్రహం ఉన్నాయి. రథం ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లతో పాటు శ్రీరామానుజుల వారిని దర్శించుకుంటున్నారని తితిదే తెలిపింది. మే 19న తిరికక్కర, మే 20న తిరువల్ల, మే 22వ తేదీన తిరువనంతపురంలో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించనున్నారు.