బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 8 జులై 2016 (15:16 IST)

ఆషాఢ మాస ఆథ్యాత్మిక వైశిష్ఠిత... శ్రీ మహావిష్ణువు విశ్రమిస్తాడు...

ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఆషాఢ మాసం ఎంతో విశిష్టమైనది. సూర్య భగవానుడు ఈ మాసంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచే దక్షిణాయానం ప్రారంభమవుతుంది. పూరి క్షేత్రంలో ఆషాఢ శుద్ధ పాడ్యమినాడు జగన్నాధ రథయాత్ర నిర్వహిస్తారు. లక్షలాదిమంది పాల్గొనే ఈ యాత్ర

ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఆషాఢ మాసం ఎంతో విశిష్టమైనది. సూర్య భగవానుడు ఈ మాసంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచే దక్షిణాయానం ప్రారంభమవుతుంది. పూరి క్షేత్రంలో ఆషాఢ శుద్ధ పాడ్యమినాడు జగన్నాధ రథయాత్ర నిర్వహిస్తారు. లక్షలాదిమంది పాల్గొనే ఈ యాత్ర ఎంతో విశిష్టం, పవిత్రం. ఈ మాసంలోనే స్కంద పంచమి, సుబ్రమణ్య షష్టి వస్తాయి. తొలి ఏకాదశి పర్వదినం వస్తుంది. పంచమ వేదంగా ఖ్యాతికెక్కిన మహాభారతాన్ని రచించిన వ్యాసభగవానుడిని పూజించే రోజును గురుపౌర్ణమిగా నిర్వహిస్తాం. 
 
ఈ మాసంలో చాతుర్మాస్య వ్రతదీక్షలు ప్రారంభమవుతాయి. ఈ నెలలో వచ్చే ఏకాదశిని తొలిఏకాదశిగా జరుపుకొంటారు. ఆషాఢమాసంలో తెలంగాణలో బోనాలు ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి నాడు క్షీరసాగరంలో పవళించిన శ్రీ మహావిష్ణువు విశ్రమిస్తాడు. దీంతో తొలి ఏకాదశిగా భక్తితో దీక్ష చేపడుతారు. ఎంతో విశిష్టత కలిగిన సికింద్రాబాద్‌ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర కూడా ఈ నెలలోనే వైభవంగా జరుగుతుంది. ఎంతో విశిష్టత, ఆధ్యాత్మికం కలిసిన విశిష్టమైన మాసం ఆషాఢమాసం.