గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 నవంబరు 2015 (16:47 IST)

భారీ వర్షాలతో శ్రీవారి ఆలయం మూతపడలేదు: టీటీడీ పీఆర్వో రవి

భారీ వర్షాలతో శ్రీవారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మూతపడినట్లు వస్తున్న వార్తలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా వెంకన్న ఆలయాన్ని మూసివేయలేదని.. సామాజిక వెబ్ సైట్లలో వెంకన్న స్వామి ఆలయాన్ని మూసేసినట్లు వస్తున్న వార్తలను టీటీడీ అధికారులు కొట్టిపారేశారు. 
 
స్వామి పుష్కరిణి, మండపాలు నీట మునిగాయని వాట్సాఫ్ మెసేజ్‌ల్లో ఫోటోలు వైరల్‌లా పాకడంతో.. భక్తులు శ్రీవారి ఆలయాన్ని భారీ వరదల కారణంగా మూసివేశారని భావించారు. దీనిపై టీటీడీ పీఆర్వో తలారి రవి మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయాన్ని మూసివేయలేదని.. కొండపై నిలుస్తున్న వర్షపు నీటిని సత్వరమే అండర్ గ్రౌండ్స్ కాలువ ద్వారా తొలగిస్తున్నామని చెప్పారు.
 
గంటకు నీటిని తొలగించే ప్రక్రియ సాగుతోందన్నారు. ఆదివారం 37వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, మరో 10వేల మంది భక్తులు 8 కంపార్ట్‌మెంట్లలో స్వామివారి దర్శనం కోసం వేచివున్నారని రవి వ్యాఖ్యానించారు.